టీడీపీతో కాంగ్రెస్ పొత్తు! ఏపీ, తెలంగాణాల్లో సంచ‌ల‌నం రేపిన ఈ విష‌యంపై అనేక విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు వ‌చ్చా యి. అనేక మంది విస్మ‌యం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ వ్య‌తిరేక పునాదుల‌పై ఏర్పాటైన టీడీపీని తిరిగి పోయి పోయి మ‌ళ్లీ కాంగ్రెస్‌తో చేతులు క‌లుపుతారా? అంటూ పెద్ద పెట్టున సోష‌ల్ మీడియాలోనూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇక‌, సొంత పార్టీ నుంచే టీడీపీ నేత‌లు గ‌య్య‌న విమ‌ర్శ‌లు సంధించారు. అన్న‌గారి ఆత్మ ఘోషిస్తుంద‌ని అన్న‌వారు కూడా ఉన్నారు. ఇక‌, జ‌నాలు బ‌ట్ట‌లూడ‌తీసి తంతారంటూ హ‌డావుడి చేసిన‌వారూ ఉన్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర క‌ల‌వ‌రం ఏర్ప‌డింది. 


నిజానికి టీడీపీకి ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాంగ్రెస్‌తో క‌ల‌వాల్సిన ప‌రిస్థితి ఉందా? అనేది కూడా ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారింది. అయితే, ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌లు కీల‌కంగా మార‌డం, ప్ర‌తిఓటూ, ప్ర‌తిసీటూ ప్ర‌ధానం కావ‌డంతో చంద్ర‌బాబు వ్యూహాత్మ కంగా ముందుకు వెళ్తున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలి వైసీపీకి ప‌డితే.. ఆ పార్టీ పుంజుకునే ప్ర‌భావం ఉంటుంది. అంటే ఇప్పుడున్న అంచ‌నాల ప్ర‌కారం.. వైసీపీ అధికారంలోకి వ‌చ్చినా రావొచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీలినా, జ‌గ‌న్‌ను విల‌న్‌గా ప్ర‌చారం చేయ‌డం వ‌ల్ల ఆవోటు కాంగ్రెస్‌కు ప‌డుతుంది. ఎలాగూ కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే.. అది ఆయ‌న‌కు ఉభ‌య తార‌కంగా ప్ర‌యోజ‌నం చేకూర్చుతుంది. 


పోనీ, కాంగ్రెస్‌తో పొత్తులేక‌పోయినా.. కాంగ్రెస్ ఎలాగూ గెలిచే ప‌రిస్తితిలో లేదు కాబ‌ట్టి.. దానికి ఓట్లు వేసినా పెద్ద‌గా పోయేది ఏమీ లేదు. దీనిని గ‌మ‌నించే చంద్ర‌బాబు కాంగ్రెస్ దిశ‌గా పావులు క‌దుపుతున్నారు. ఇక‌, ఈ విష‌యంపై కాంగ్రెస్ క్లారిటీగానే ఉంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు పనబాక లక్ష్మి చెప్పారు. అధిష్ఠానం ఆదేశిస్తే టీడీపీతో కలిసి పనిచేసేందుకు తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని అన్నారు.  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హో దా కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమన్నారు.  


రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధిష్టానం టీడీపీతో పొత్తుకు సై అంటే తాము సైకిళ్లు ప‌ట్టుకుని తిరుగుతామ‌ని అన్నారు. ఇక‌, రెండు రోజుల కింద‌ట కాంగ్రెస్‌తో పొత్తు విష‌యంలో టీడీపీ నేత‌, డిప్యూటీ సీఎం కేఈ వ్యాఖ్య‌ల‌పై మాజీ సీఎం కుమారుడు కోట్ల సూర్య‌ప్ర‌కాశ రెడ్డి కూడా కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు విష‌యాన్ని వ్య‌తిరేకించ‌లేదు. కేఈ వ్యాఖ్య‌లు.. ఆయ‌న టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకేన‌ని చెప్పుకొచ్చారు. ఇలా మొత్తానికి కాంగ్రెస్ నేత‌లు చెబుతున్న మాట‌ల మేర‌కు కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఖాయ‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వుతోండ‌డం గ‌మ‌నార్హం. 


మరింత సమాచారం తెలుసుకోండి: