ఇపుడు దేశంలో రాజకీయమంతా మోడీ వర్సెస్ అదర్స్ అన్నట్లుగా మారిపోయింది. బీజేపీయేతర నాయకులు కలిస్తే చాలు మోడీని దించేస్తామంటూ శపధాలు చేస్తున్నారు. ముందు ఆయన దిగిపోవాలి, అదే మా అజెండా అంటున్నారు. అదే మా రాజకీయమూ అని  నొక్కి వక్కాణిస్తున్నారు, గట్టిగా చెబుతున్నారు


కుమార బాబు :


ఇక, తన సర్కార్ నిలబెట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి ఈ రోజు విజయవాడ వచ్చి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబు దర్శనమూ చేసుకున్నారు. ఓ హొటల్లో జరిగిన ఇద్దరు సీఎంల భేటీలో దేశ రాజకీయాలే చర్చకు వచ్చాయి. దేశంలో మోడీని ఓడించాలని నిర్ణయించారట. అందుకుగానూ అన్ని పార్టీలనూ కలిపేసుకోవాలనీ డిసైడ్ అయ్యారట.


ఆ వూసు తరువాతట :


ముందు అర్జంట్ గా మోడీ దిగిపోవాలి. ఇదే మా ప్రోగ్రాం  అంటున్నారు కర్నాటక కుమారం. మరి మీ కూటమికి ప్రధాని ఎవరు అని మీడియా అడిగితే మాత్రం కుమారస్వామి దగ్గర ఆన్సర్ లేదు. ముందు మేము అధికారంలోకి రావడమే ముఖ్యం. ఆనక ప్రధాని ఎవరన్నది చూస్తామంటూ చెప్పుకొచ్చారు. అంటే ఈ ఐక్యత అంతా మోడీని ఓడించడానికే తప్ప వీరంతా కలసి ఒక్కటిగా పాలించడానికి కానే  కాదన్న మాట. 


బాబును ఉబ్బేసిన స్వామి :


ఏపీ సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అంటూ కుమారస్వామి ఓ రేంజిలో పొగిడారు. టీడీపీ, జేడీఎస్ బంధం విడదీయలేనిదని అన్నారు.  అమరావతిను అద్భుత రాజధాని గా బాబు చేస్తున్నారని కితాబు ఇచ్చేశారు. దేశంలోని 17 ప్రాంతీయ పార్టీలను కూడగట్టిన మొనగాడు బాబు అన్నారు. రేపటి రోజున మోడీని దించేదీ బాబు సారధ్యమేని భారీ స్టేట్మెంట్ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: