హరికృష్ణ స్మారక నిర్మాణానికి కేసీఆర్ స్థలం కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం తీసుకోవడంలో రాజకీయం ఉందని.. తెలంగాణలోని టీడీపీ సానుభూతి పరులను, కమ్మ సామాజికవర్గం వాళ్లను దగ్గర చేసుకోవడానికే కేసీఆర్ ఇంత ఉదారంగా నిర్ణయం తీసుకున్నాడనే అభిప్రాయం గట్టిగా, ఘాటుగా వినిపిస్తోంది. ఎవడబ్బ సొమ్మని? అంటూ కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు తెలంగాణ వాదులు. ఇక అందులోనూ హరి సమైక్యవాది. ఆ విషయాన్ని రాజ్యసభలోనే ప్రకటించుకున్నారాయన.

Image result for kcr

అప్పట్లో సమైక్యవాదానికి అనుకూలంగా చేసిన రాజీనామాల్లో ఆమోదం పొందినది ఏదైనా ఉందంటే అది హరిది మాత్రమే. ఆ రాజీనామా ఆమోదంలో కూడా చంద్రబాబు కుట్ర సుస్పష్టం.  ముందురోజు ఒక పెళ్లిలో నాటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, కేరళ కాంగ్రెస్ నేత కురియన్ తో బాబు సమావేశం కావడం... మరుసటి రోజే హరి రాజీనామా ఆమోదం పొందినట్టుగా ప్రకటన రావడం చకచకా జరిగిపోయింది. అది వేరే విషయం.

Image result for harikrishna

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన సమైక్యవాది అయిన హరికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు తప్పు పట్టాల్సినదేమీ కాదు.. కానీ కేసీఆర్ తన రాజకీయాల కోసం స్మారకాలకు భూ కేటాయింపు కూడా చేసేయడం మాత్రం తెలంగాణ వాదుల్లో అసహనాన్ని కలిగిస్తోంది. వారికి హరిపై కోపం లేకపోయినా.. కేసీఆర్ రాజకీయం మీద మాత్రం పీకల్లోతు అసహనం కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: