రోడ్డుప్రమాదంలో మరణించిన నందమూరి తారకరామారావు తనయుడు, సినీనటుడు, తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణకు తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించటం జరిగింది. దీన్ని కొందరు రాజకీయకోణంలో చూస్తున్నారు అందుకే ఇది ఒక రాజకీయ ఎత్తుగడ అనుకోవటం ఒక ఆప్షణ్. అయితే, హరికృష్ణ స్మారకాన్ని నిర్మించే అంశం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయమే అనటంలో సంశయం అవసరం లేదు. 

Image result for harikrishna memorial


అందుకే కెసిఆర్ పై, తెలంగాణ ప్రభుత్వంపై, సామాజిక ప్రసారమాధ్యమం (సోషల్ మీడియా)లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ స్మారక నిర్మాణం విషయం లోని రాజకీయ నేపధ్యం వలన, హరికృష్ణ మరణంపై కేసీఆర్ సర్కారు స్పందించిన తీరుపై, అధికార లాంచనాలతో అంత్యక్రియల నిర్వహణకు ఇచ్చిన ఆదేశాలు సైతం రాజకీయమయమై పోతున్నాయి. 
Image result for KCR donot shown respect to dasaradhi rangacharya on his death

సోషల్ మీడియాలో గడిచిన రెండు రోజులుగా వస్తున్న వ్యాఖ్యలకు.జరుగుతున్న ప్రతికూల ప్రచారం (నెగిటివ్ పబ్లిసిటి) అంతా ఇంతా కాదు. ఈ నిర్వాకమంతా  ‘తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్ల మనసు దోచుకోవటానికే అన్నవాదన’ ను పలువురు విశ్లేషకులు బలపరుస్తున్నారు.

Image result for harikrishna memorial

ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాల అనంతరం,  హరికృష్ణ స్మారకాన్ని నిర్మించటం ఏమిటంటూ, “వాట్సాప్ లో ఒక మేసేజ్” వైరల్ అవుతోంది. దాన్ని యథాతధంగా ఈ క్రింద పొందుపరుస్తున్నాను. 

*గూడ అంజన్న చనిపోతే కనీసం వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు కేసీఆర్ కుటుంభం....

*తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు ప్రో.కేశవరావు జాదవ్ మరణిస్తే కనీసం పరామర్శించకపోతివి.

*నీకు ఉద్యమంలో ఒడిదోడుకులు ఎదురైనపుడు జలదృశ్యంలో ఆశ్రయం ఇచ్చిన కొండ లక్ష్మణ్ బాపూజీ చనిపోయినపుడు  కనీసం పరామర్శించక పోతివి.

*1200 మంది తెలంగాణ కోసం బలిదానం చేసుకుంటే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడా నికి సమయం ఉండదు. తప్పుడు లెక్కలతో 400 మందికే పరిహారం ఇస్తివి.

*రామానాయుడు - హరికృష్ణ చనిపోతే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు?

*నిర్లక్ష్యంగా నిబంధనలు పాటించకుండా కనీసం సీట్ బెల్ట్ పెట్టుకోకుండా 120.కి.మీ వేగం తో బండి నడిపి చనిపోయిన వ్యక్తికి - నరనరాన తెలంగాణని వ్యతిరేకించి - చివరికి సమైక్యాంధ్ర కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన వ్యక్తికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలా??

*సామాన్య ప్రజల్ని - విద్యార్థుల్ని పీల్చి పిప్పి చేసి విద్యని వ్యాపారమయం చేసిన సీమాంధ్ర కార్పొరేట్ కాలేజి అధినేత కొడుకు  అతి వేగంతో మెట్రో డివైడర్ కి గుద్దుకొని చస్తే ప్రభుత్వంలో ముఖ్యస్తానంలో ఉన్న మంత్రి అన్ని దగ్గరుండి చూసుకొని శవాన్ని పంపిస్తారు.

*ఎవరికోసం తెలంగాణ తెచ్చుకుంది దొరా??? ఇదేనా బంగారు తెలంగాణ????


Image result for harikrishna memorial


అంటూ ఒక మేసేజ్ వైరల్ అవుతోంది. ఇది భారీగా సర్క్యులేట్ కావటమే కాదు మరిన్ని ప్రశ్నల్ని చర్చకు తెచ్చింది. 
Image result for anr

*లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరణించినప్పుడు కనీసం ఆయనకు నివాళులు అర్పించేందుకు సైతం కేసీఆర్ రాలేదని గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్ కు తెలుగు చిత్రపరిశ్రమ వచ్చిందంటే కారణం అక్కినేని. ఎవరు అవునన్నా, కాదన్నా హైదరాబాద్ లో అప్పట్లోనే స్టూడియో కట్టే ధైర్యం చేయటం ద్వారా  టాలీవుడ్ హైదరాబాద్ కు వచ్చే ప్రయత్నం చేశారు. మరి అలాంటి ఆయన్ను పరామర్శించలేదు.
Image result for KCR donot shown respect to dasaradhi rangacharya on his death

*అక్కినేని సీమాంధ్రుడు అనుకుంటే, తెలంగాణకు నిలువెత్తు రూపం లాంటి దాశరధి రంగాచార్యుల వారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతే ఆయన్ను పరామర్శించేందుకు సైతం కేసీఆర్ కు సమయం దొరకలేదన్న విషయాన్ని పలువురు గుర్తు తెచ్చుకుంటున్నారు. 

*హైదరాబాద్ లోని సీమాంధ్రులను కడుపులో పెట్టుకొని చూస్తానని, వారి కాలికి ముల్లు గుచ్చుకుంటే తన నోటితో తీస్తానని చెప్పిన కేసీఆర్ - తాజాగా హరికృష్ణ మీద అంతగా అభిమానాన్ని ప్రదర్శించటానికి కారణం త్వరలో జరిగే ముందస్తు ఎన్నికల్లో సీమాంధ్రుల ఓట్లను కొల్లగొట్టటానికా?  అన్న ప్రశ్నను సంధిస్తున్నారు.

*సీమాంధ్రుల మనసుల్ని దోచుకునే క్రమంలో తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బ తీసేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు?  అంత ధైర్యం కేసీఆర్ ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నను కొందరు వేస్తుంటే, తెలంగాణ వారిని అనునయించగల సత్తా తనలో ఉందన్న ఉద్దేశమే కేసీఆర్ ఇలా చేయటానికి కారణమని అంటున్నారు. 

*ఇదిలాఉంటే, హరికృష్ణకు స్మారకం నిర్మించాలన్న కేసీఆర్ నిర్ణయంపై పలువురు వ్యంగ్యంగా రియాక్ట్ అవుతూ,  సార్! ప్లీజ్ కాళేశ్వరం పేరు మాత్రం మార్చొద్దంటూ చేస్తున్న వ్యాఖ్యల్ని, సోషల్ మీడియాలోనూ, వాట్సాప్ లోనూ వైరల్ అవుతున్న మెసేజ్ లు కేసీఆర్ దృష్టికి వెళుతున్నాయా??????? 

తెదేపా నేత, నటుడు నందమూరి హరికృష్ణ స్మారక చిహ్నంపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పలు వ్యాఖ్యలు చేశారు.

kodandaram comments on memorial for harikrishna in hyderabad

సెప్టెంబరు 12న దీక్ష చేపట్టనున్నారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం 

మ‌హాప్రస్థానంలో హరికృష్ణ స్మార‌క‌ చిహ్నం ఏర్పాటుకు 450 గ‌జాల స్థలం కేటాయిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంపై తెలంగాణవాదుల నుంచి విమర్శలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. 

ఈ సందర్భంగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హరికృష్ణను గౌరవించినట్లే ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను సైతం గౌరవించాలని డిమాండ్ చేశారు. రాజకీయ అవసరాలను బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. అమరుల త్యాగాలను గుర్తుకు చేస్తూ సెప్టెంబరు 12న దీక్ష చేపట్టనున్నానని కోదండరాం తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: