వామపక్షాలు ఎపుడూ జీవిత కాలం లేట్ గా ఆలోచనలు చేస్తాయని పేరు. అంతేనా చారిత్రాత్మక తప్పిదాలు చెస్తూనే ఉంటాయి. విభజన నాలుగేళ్ళు ఏపీలో రాజకీయం చేసిన తరువాత కానీ వాళ్ళకు మూడవ ప్రత్యామ్నాయం గుర్తుకురాలేదు. అదీ జనసేనాని టీడీపీని వీడి బయటకు వచ్చేసిన తరువాతనే ఆ పాట పాడడం విశేషం. పూర్వం రోజుల మాదిరిగా ఉభయ పార్టీలకు కాలం కలసిరావడంలేదసలు.


ప్రజలు కోరుతున్నారట :


ఏపీలో ఏ సర్వే చూసిన టీడీపీ, వైసీపీల మధ్యనే ఆగిపోతోంది. ఏ ఒక్క ఓటర్ ని అడిగినా ఈ రెండు పార్టీలలో ఏదో ఒక దానికి తమ ఓటు అంటున్నాడు. మధ్యలో వచ్చిన జనసేనకు కూడా  అభిమాన జన బలం బాగానే ఉంది. ఇది కదా ఏపీ రాజకీయ ముఖ చిత్రం. మరి ఎర్రన్నలకు మాత్రం ప్రజలు మూడవ కూటమి కోరుతున్నట్లుగా అనిపిస్తోందట. జనం కోసం మేము గట్టిగా ఆ పనిలో ఉన్నామని అంటున్నారు కామ్రేడ్స్


బస్సు యాత్ర మొదలు :


ఏపీలో మూడవ కూటమి కోసం ఉభయ వామ పక్షాల బస్సు యాత్ర ఈ రోజు మొదలైంది. సీపీయెం నాయకుడు బీవీ రాఘవులు, సీపీఐ నేత నారాయణ కలసి ఈ బస్సు యాత్రను విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ ఈ సందర్భంగా  ఇద్దరు నేతలూ మాట్లాడుతూ, ప్రధాన పార్టీలన్నీ అన్ని విధాలుగా వైఫల్యం చెందాయని కామెంట్స్ చేశారు. ఈ కారణంగా ప్రజలు మూడవ కూటమి వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు.

అందువల్లనే తాము బస్సు యాత్ర తలపెట్టామని అన్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ గతం పొరల నుంచి బయటకు వచ్చి వర్తమాన కాలం రాజకీయాలు చేస్తే కామ్రేడ్స్ కి మంచి రోజులు ఉంటాయని అంటున్నారు. కానీ తాము ఎక్కే ప్రతీ రైలూ  లేట్ చేసుకుంటున్న కామ్రేడ్స్ కి కరంట్ పాలిటిక్స్ ఏ మాత్రం సరిపడడంలేదని సెటైర్లు పడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: