కేసీఆర్ మేన అల్లుడైనా హరీష్ రావు మొదటి నుంచి మేన మామ కు అండగా ఉంటూ పార్టీలో మంచి ప్రాధాన్యతను సంపాదించుకున్నాడు. అయితే హరీష్ రావు మంచి మాటకారి సమర్థుడైనా నాయకుడు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయి కుమారుడిని ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. కాని నిజానిజాలు స్పష్టంగా తెలియవు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరీష్‌రావు పనితీరును బహిరంగంగా ప్రశంసించిన సందర్భాలు అనేకమున్నాయి.

Image result for kcr and harish rao

కొన్ని సభల్లో మంత్రిని ఆకాశానికి ఎత్తేశారు. అలాగే కేటీఆర్‌ కూడా పొగిడిన సందర్భాలున్నాయి. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతిపక్షాలు ఆయన మీద పైచేయి సాధించలేకపోయాయి. ఇప్పటివరకు జరిగిన అన్నిరకాల ఎన్నికల్లోనూ అపజయం మూటగట్టుకున్నాయి. దీంతో ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేయాలనుకున్న ప్రతిపక్షాలకు గతంలో సచివాలయం కూల్చివేత నిర్ణయం ఆయుధంలా దొరికింది. సచివాలయం కూలగొట్టాలనుకోవడానికి అది ఇరుకుగా ఉండటమో, అసౌకర్యంగా ఉండటమో కాదు. భయంకరమైన వాస్తు దోషాలు.

Image result for ktr and harish rao

వాస్తు దోషాలున్న సచివాలయం మంత్రి కేటీఆర్‌కు ఎక్కువ నష్టమని ప్రతిపక్షాలు చెప్పాయి. ఇదెలా? కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని తండ్రి అనుకున్నారని, వాస్తు దోషాల కారణంగా అతను ముఖ్యమంత్రి కాలేకపోవడమే కాకుండా ముఖ్యమంత్రి రేసులో మేనల్లుడు హరీష్‌ రావు ముందుంటాడనే అనుమానం కేసీఆర్‌కు ఉందని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. ఇదే సచివాలయం కొనసాగితే కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాలేడని, కాబట్టి కూల్చాలని నిర్ణయించుకున్నారని ప్రతిపక్ష నేతలు కొందరన్నారు. ఏనాటికైనా కేసీఆర్‌కు హరీష్‌ వెన్నుపోటు పొడుస్తాడని ప్రతిపక్షాలు మొదట్నుంచీ ప్రచారం చేస్తున్నాయి. కేసీఆర్‌ తరువాత పార్టీలో పట్టున్న నాయకుడని చెప్పొచ్చు. ఆయనకంటూ ఓ వర్గం ఉందని అంటారు. విపక్షం ప్రచారం చేస్తున్నట్లుగా భవిష్యత్తులో హరీష్‌రావు ఏదైనా చేయాలనుకుంటే అసాధ్యం మాత్రం కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: