ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటు అయ్యాక గత 65 ఏళ్ళ కాలంలో పాలించిన ముఖ్యమంత్రులలో ఎన్నతగిన వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన మానవత్వం, మంచితనం కొలమానంగా చేసుకుని పాలన సాగించారు. చట్టాలు, నిబంధలను ఎన్ని ఉన్నా పేద వారికి మేలు జరిగే విధానమే ఆయన పాలసీ అయింది. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా లెక్కకు మిక్కిలి సంక్షేమ  కార్యక్రమాలు ఆయన కాలంలో అమలులోకి వచ్చాయి.


ప్రజా వైద్యుడు :


స్వతహాగా డాక్టర్ అయిన రాజశేఖర రెడ్డి సమస్యల పరిష్కారంలోనూ అదే లోతైన చూపు తో మూలాల వరకూ వెళ్ళేవారు. ఎక్కడ జబ్బు ఉంది, మందు ఏమిటి అన్నది కనుగొనడంలో నేర్పరి ఆయన. అంతే కాదు, ఆ జబ్బు తిరిగి రాకుండా చేయడంలోనూ నిష్ణాతుడు. అందుకే అయిదున్నరేళ్ళ వైఎస్సార్ పాలన ఓ స్వర్ణ యుగంగా మారింది. పది కాలాలు చెప్పుకునేలా చరిత్రలో నిలిచింది.


అరుదైన వ్యక్తిత్వం :


వైఎస్సార్ ది అరుదైన వ్యక్తిత్వం. మాట ఇస్తే వెనక్కౌ పోవడం ఆయనకు తెలియదు. అలాగే నమ్మితే వాళ్ళకు ప్రాణం ఇవ్వడమే తెలుసు. ఇక స్నేహశీలీగా ఆయనకు చెప్పుకోవాలి. చెరగని చిరునవ్వుతో శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునే నేర్పూ, ఓర్పూ ఆయనకే సొంతం. అందుకే ఆయన పాలనలో ప్రతిపక్షాలు విమర్శలన్నీ అలా పిల్ల మబ్బుల్లా పక్కకు పోయేవి. నిబ్బరం, నిబద్ధత రాజశేఖరుని వ్యక్తిత్వానికి మరింత వన్నె తెచ్చాయి.


పోరాటయోధుడు :


వయసులో ఉండగానే పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్సార్ అప్పటికే  తరగని ప్రజాదరణను సొంతం చేసుకున్నారు. సినిమా గ్లామర్ తో సీఎం అయిన ఎంటీయార్ ని ఒంటి చేత్తొనే ఎదుర్కొన్నారు. పార్టీలో సీనియర్లు కలసి వచ్చినా  రాకపోయినా తన పంధాలో ఉద్యమాలు చేశారు. అంతటి టీడీపీ ప్రభంజనంలోనూ కాంగ్రెస్ వాణిని బలంగా వినిపించగలిగారు. అది మొదలు పోరాటాలలోనే ఆయన మరో రెండు దశాబ్దాలకు పైగా గడపాల్సివచ్చింది. 


వూరించి.. వరించి...:


ఇక ఏపీ ప్రజలకు ఎంతో చేయాలని తపన పడిన వైఎస్సార్ కు ముఖ్యమంత్రి ప్రీఠం మాత్రం అంత సులువుగా దక్కలేదు. ప్రతీ సారీ ఆయన పేరు పరిశీలనలోకి రావడం, చివరలో తప్పిపోవడం ఓ ఆనవాయితీగా మారింది. చివరకు జనం మద్దతుతోనే 2004 ఎన్నికలలో ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. ధైర్యంగా అనేక కార్య్కక్రమాలను ప్రకటించడమే కాదు, వాటిని అమలు చేసిన ఘనత కూడా ఆయనదే.

ఆరోగ్య‌శ్రీ, మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, రైతులకు అండంగా అనేక పధకాలు చేపట్టడమే కాదు పేద పిల్లల కోసం ఫీజు రీఅంబర్స్ మెంట్ పధకం పెట్టడం ద్వారా ఎందరో పెద్ద చదువులు చదివేలా చేశారు.. అనుకోని ఓ దుర్ఘటనలో ఆయన ప్రజల మధ్య నుంచి వెళ్ళిపోయినా జనం గుండెళ్ళో మాత్రం శాశ్వతంగా గూడు  కట్టుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: