అందరూ చెబుతూంటే వారూ చెప్పేశారు. అలా చెప్పడం జస్ట్ ఫార్మాలిటీ అయినా వారిద్దరూ చెప్పడం మాత్రం విశేషమే. పైగా  ఇపుడు అతను శత్రు శిబిరంలో ఉన్నారు. అయినా చెప్పడంలో తప్పు లేదు, ఎవరైనా చెప్పేదీ అదే. కానీ వాళ్ళు చెప్పడంతోనే అది హైలెట్ అవుతోంది. ఇంతకీ ఎవరా ఇద్దరూ.. ఏమా కధ..


హ్యపీ బర్త్ డే పవన్ :


ఈ రోజు సెప్టెంబర్  2. అంటే ఓ విశేషం ఉన్న రోజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మ దినం ఈ రోజు. అంతేనా ఏపీ రాజకీయాల మూడవ రాజకీయం చేస్తానంటూ దూసుకువస్తున్న జనసేనాని పుట్టిన రోజు. ఏపీ వ్యాప్తంగా భారీ అభిమానులు కలిగిన పవన్ బర్త్ డే అంటే అలాంటి ఇలాంటి సందడి కాదు. సినీ, రాజకీయ ప్రముఖులంతా ట్విట్టర్ల ద్వారా, ఇతర మార్గాల  ద్వారా  ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా పవన్ కి విషెస్ చెప్పేసారు.


వారూ చెప్పారు :


‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  విషెస్ చెబుతూ ఈ రోజు  ట్వీట్ చేశారు. ‘‘హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్.. మీరు మంచి ఆరోగ్యంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా..’’ అని పేర్కొన్నారు. చంద్రబాబు పెట్టిన ఈ ట్వీట్ చూసిన మెగా అభిమానులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందే ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ కూడా అచ్చం ఇలాగే ట్విట్టర్ ద్వారా పవన్ ని గ్రీట్ చేశారు. ఇది మంచి పరిణామమే.



 రాజకీయం కాకుండా ఎవరికైనా వ్యక్తిగతం ఉంటుంది. మరి ఈ రోజున ఇలా ఓ ట్వీటడం  ద్వారా అర్ధమూ, పరమార్ధమూ రెండూ దక్కుతాయిగా. ఏదేమైనా సరైన టైంలో తండ్రీ కొడుకులు ఇలా ట్వీట్ చేశారని టాక్ నడుస్తోంది. దీనిదేముంది కానీ ఇంతకు ముందు ప్రధాని మోడీ కూడా పవన్ కి జన్మ దిన శుభాకాంక్షలు  చెప్పిన సంగతి విధితమే. దీనిని బట్టి చూస్తూంటే రాజకీయ విషెస్ కి ఓ పరమార్ధం ఉంటుందని అర్ధం కావట్లా..


మరింత సమాచారం తెలుసుకోండి: