హరి కృష్ణ చనిపోవడం తో ఇప్పుడు పెద్ద దిక్కు కరువైపోయింది. ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ ను అతని ఫ్యామిలీ లో హరికృష్ణ తప్ప ఎవరు పెట్టించుకోలేదని ఒక వాదన  ఉన్నది. హరి పెద్ద తనయుడు జానకిరాంతో తారక్‌కు చాలా సాన్నిహిత్యం ఉందని, ప్రేమ వివాహం చేసుకున్న జానకిరామ్‌కు చిన్న తమ్ముడు తారక్‌ చాలా అండగా నిలిచాడని అంటారు. అలాగే హీరోగా సక్సెస్‌ఫుల్‌ గా కెరీర్‌ను సాగించలేకపోతున్న కల్యాణ్‌రామ్‌కు కూడా ఇప్పుడు తారక్‌ అండగా మారాడు.

Image result for jr ntr and kalyan ram

ఇక బాలయ్య కొన్నేళ్లుగా ఎన్టీఆర్‌పై అంత ప్రేమతో అయితే కనిపించడంలేదు. ఒకేరోజు సినిమాలతో ఢీకొనే దశకు వచ్చి చాలాకాలం అయ్యింది. ఇక అభిమానుల్లో కూడా బాలయ్య ఫ్యాన్స్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అనే స్పష్టమైన చీలిక ఉంది. కోస్తాజిల్లా కమ్మ వాళ్లలోనే ఈ రెండువర్గాలు ఏర్పడటం గమనార్హం. ఏం జరిగినా చంద్రబాబును వదిలి పక్కకు రాలేని పరిస్థితిలో ఉన్నాడు బాలయ్య.

Image result for jr ntr and kalyan ram

ఇలాంటి నేపథ్యంలో హరి అనంతరం తారక్‌ ప్రస్థానం మరోరకంగా ఉండబోతోంది. తాతయ్య నటనా పటిమనే కాకుండా.. నాయకత్వ లక్షణాలను కూడా అందిపుచ్చుకునేలా ఉన్నాడు తారక్‌. దీన్నిబట్టి ఇతడే ఇకపై బాలయ్య మినహా నందమూరి కుటుంబానికి పెద్దదిక్కుగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తెలుగుదేశం వారసత్వాన్ని పూర్తిగా తన తనయుడికే అప్పగించాలి అనేది బాబు లెక్క. 'పప్పు' అనిపించుకుంటున్న లోకేష్‌కే పార్టీకి భావి నాయకుడు తప్ప మరెవరూ కాదని బాబు తేల్చి చెబుతున్నాడు. అయితే మరికొంచెం నిలదొక్కుకుంటే.. చంద్రబాబు, లోకేష్‌లకు భవిష్యత్తులో పెద్ద సవాల్‌గా మారే అవకాశాలు మాత్రం ఖాయంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: