చంద్రబాబు ఏది చేసినా గొప్పలు ఎక్కువగా చెప్పుకుంటారని పేరు. చేసేది ఎంత అనేది పక్క పెడితే బాబు చెప్పేది బోలెడు ఉంటుంది. ఏ మీటింగ్ అయినా అది నాచురల్ అయిపోయింది బాబు గారికి. ఈ మధ్యన జరిగిన నారా హమారా...టీడీపీ హమారా ప్రొగ్రాంలో కూడా అలా అతి ప్రచారానికి పోయి బాబు తడబడ్డారు. అంతే  గోల గోల.. ఇపుడదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అలెగ్జాండర్ ని ప్రెసిడెంట్ చేశా :


ఇంతకీ ఎవరా అలెగ్జాండర్, ఎమా కధ అంటే బాబు గారికే తెలియదేమో.. నారా హమారా మైనారిటీ సభలో బాబు గారు మాట్లాడుతూ మైనారిటీలకు ఎంతో చేశామని చెప్పుకొచ్చారు. అలా చెబుతూ  'తెలుగుదేశం పార్టీ గా ఎన్నో చరిత్రలు సృష్టించాము. ఒకటి రెండు కాదు ఒక దశలో అలెగ్జాండర్‌ గారిని ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాగా చేశాము. నేనొక్కటే చెప్పాను ఈ దేశానికి అన్ని విధాలుగా అర్హత కలిగిన వ్యక్తి ఆయనే ఉండాలని చెప్పి ప్రధాన మంత్రిగారిని ఒప్పించి దేశ అధ్యక్ష పదవికి సహకరించిన పార్టీ ఈ తెలుగు దేశం పార్టీ' అంటూ చంద్రబాబు ఆవెశంగా చెప్పేశారు.


రాష్ట్రపతి ఎవరూ లేరు :


నిజానికి అలెగ్జాండర్  పేరుతో ఇంతవరకూ దేశంలో రాష్ట్రపతి అయింది ఎవరూ లేరు. కానీ బాబు గారు పొరపడ్డారో, తడబడ్డారో తెలియదు కానీ ఆ పేరు అనేశారు. నిజానికి మైనారిటీని  రాష్ట్రపతి  చేశామంటూ బాబు చెప్పబోయే పేరు మాజీ  రాష్ట్రపతి అబ్దుల్ కలాంది అయి ఉంటుంది. అప్పట్లో వాజ్ పేయ్ టైమ్ లో  బాబు ఆయన పేరు ప్రతిపాదించారు. అదీ అసలు విషయం. ఆ పేరు చెప్పబోయి బాబు తడబడితే అలెగ్జాండర్‌ ఎవరో తెలియక సభలో ఉన్న వారూ తడుముకున్నారు. ఇపుడది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: