ఏపీలో 2019 ఎన్నికల నేపథ్యంలో విపక్ష వైసీపీ నుంచి పోటి చేసేందుకు అభ్యర్ధుల తాకిడి ఎక్కువగా ఉంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడ ఓటర్లు ఎన్నో ఆశలతో సీనియర్‌గా ఉన్నా చంద్రబాబు నాయుకు పట్టం కట్టారు. నాలుగేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమి లేదన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఆడిన పిల్లి మొగ్గల ఆటపై ఏపీ జనాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.  ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అన్న చంద్రబాబు జ‌నాల్లో వ్య‌తిరేక‌త రావ‌డంతో పాటు... విపక్షాల పోరాటంతో కళ్లు తెరిచి ప్రత్యేక ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదానే ముద్దు అన్న సిద్థాతంతో తిరిగి యూటర్న్‌ తీసుకున్నారు. 

Image result for tdp

ఇక నాలుగేళ్లగా ఏపీ రాజధాని నిర్మాణం అతీగతి లేదు. పోలవరం ఏదో సాధించామని చెప్పుకుట్టున్నా పోలవరంలో ఇప్పటికీ 50 శాతం ప‌నులు పూర్తి కాలేదు. పట్టిసీమతో తూ తూ మంత్రంగా ప్రకాశం బ్యారేజీకి వాటర్‌ తరలించి పబ్బం గడిపేసుకున్నారు. రాజధాని నిర్మాణ పనులు, రహదారులు ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే టీడీపీపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు న్యూట్రల్‌గా ఉన్న‌ పలుగురు సీనియర్ రాజ‌కీయ నాయుకులు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నా సీనియర్లతో పాటు టీడీపీలో ఉన్న‌ సీనియర్లు సైతం.... ఆపరేషన్ ఆక‌ర్ష్‌ నేపథ్యంలో టీడీపీలో రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిన వారంతా ఇప్పుడు వైసీపీకి చూస్తుండడం ఆసక్తికరంగా మారింది. 

Image result for jagan

ఇటు చంద్రబాబుపై ఏపీ జనాల్లో క్రమక్రమంగా నమ్మకం తగ్గుతుండడం అటు కొత్తగా జనసేన ద్వారా వచ్చే ఎన్నికలకు రెడీ అవుతున్నా పవన్‌కళ్యాణ్‌ను ప్రజలు విశ్వసించే ప‌రిస్థితి లేకపోవడంతో ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయి.   ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీలో పలువురు సీనియర్‌ నాయకులు టీడీపీలోనూ కొందరు కీలక నాయకుల సైతం వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీలు కొత్త చేరిక‌లతో ఎక్కడాలేని ఉత్సాహం నెలకొంది. పలుగురు నాయ‌కులు వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తుండడంతో ఆ పార్టీలో శాసనసభ‌, లోక్ సభ టికెట్లుకు పోటీ ఎక్కువైయ్యే ఛాన్సులు కనిపిసున్నాయి. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో టీడీపీలో సీట్లు వ‌చ్చే ప‌రిస్థితి లేనివారంతా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం వైసీపీ వైపే చూస్తున్నారు. 


నెల్లూరు, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వైసీపీ సీట్ల కోసం డిమాండ్‌ ఎక్కువగా కనిపిస్తోంది. వైసీపీ తరుపున పోటీ చేసేందుకు ఆశావాహుల‌ సంఖ్య ఎక్కువ అవ్వడంతో ఇటు పార్టీ అధిష్టానానికి కూడా ఎవ్వరికి సీట్లు ఇవ్వాలో తెలియకా పెద్ద తల నొప్పిగా మారే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ సమస్యలు జగన్‌ ఎలా పరిష్కరిస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: