నందమూరి తారక రామారావు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి తొలిఎన్నికలను వదిలేస్తే, ఆ తరవాత ప్రతిసారీ అంటే ప్రతి ఎన్నికలోను ఏవో కొన్ని పార్టీలతో పోత్తులేకుండా తెలుగుదేశం అదికారంలోకి రాలేదు. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో పోత్తులేని ఎన్నికల పోరాటం కాని విజయం కాని లేదు. అన్నీ పార్టీలను ఒక చుట్టు చుట్టేసిన చంద్రబాబు తన టిడిపితో పొత్తు పెట్టుకున్న ఏ ఒక్క పార్టీని కూడా బ్రతికి బట్ట కట్టనీయలేదు. గతంలో కమ్యూనిష్టులు అలా తమను తాము టిడిపితో పొత్తు పెట్టు కొని ఇప్పుడు రాష్ట్రంలో కలికానికి కూడా కనిపించకుండా పోయారు.


senior NTR TDP Vs CBN TDP కోసం చిత్ర ఫలితం


చివరికి బిజెపితో పొత్తుపెట్టుకొని 2014లో టిడిపి-బిజెపి విజయం సాధించారు. అంతేకాదు బాజపాతో పొత్తుపెట్టు కొని అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లుపైగా బాజపాని ఒక్క సారి కూడా విమర్శించకపోగా, బాజపా చేసిన ప్రతి పనిని అంటే విఫల ప్రయోగమైన "పెద్దనోట్లరద్ధు" వరకు ఒక అత్యద్భుతం అని పొగిడేసి రాజకీయ కారణాంతరాల వల్ల ఎన్ డి ఏ నుండి బయటపడి - ఈ నాలుగేళ్ళు కేంద్రంలోని బాజపా పాలనను పొగిడేస్తూ వచ్చిన టిడిపి - నేడు ఒక్కసారిగా బాజపాని ధారుణంగా అవమానిస్తూ ఆ పార్టీకి కూడా -  గతంలో తను పొత్తుపెట్టుకున్న పార్టీలకు ఇచ్చినట్లే ఝలక్ యిచ్చారు. 

సంబంధిత చిత్రం

ఇప్పుడు ఏపార్టీ కూడా టిడిపి మైత్రిని కోరుకోని పరిస్థితుల్లో, ఏ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేఖతతో పుట్టిందో ఆ కాంగ్రెస్ తో పొత్తు కోసం తహ తహ లాడి పోతున్న టీడీపీకి, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి టిడిపి-కాంగ్రెస్ మైత్రి కి డీల్ సెట్-చేసి వారి మద్య రాజకీయ కళ్యాణానికి ముహూర్తం పెట్టబోతున్నారా? అంటే, అవుననే అంటున్నారు తెదెపా వారితో సహా మొత్తం దేశం. ఈ మహత్కార్యంలో భాగంగానే విజయవాడలో "బాబు-స్వామి" ఏకాంతంగా చర్చలు జరిపారు.

congress tdp alliance కోసం చిత్ర ఫలితం

గంటన్నరపాటు 'హోటల్ గేట్ వే'లో ఏకాంతంగా వీరిద్దరు మంతనాలుకొనసాగించారు. బైటకొచ్చిన వీరిద్దరు ఎన్డీఏని ఓడించడానికి కలసి పనిచేస్తామని చెప్పారు. అంటే దానర్థం కాంగ్రెస్ తో అక్రమంగా జతకడతామనేగా దీనర్ధం అంటున్నారు జనం.

cunning chandrababu కోసం చిత్ర ఫలితం

ఇప్పటికే కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణం నడుస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-కాంగ్రెస్ సంకీర్ణం ఇక తెరపైకి రావలసి ఉంది. కుమారస్వామి కుమారునికి సంభంధం చూసే నిమిత్తం విజయవాడ వచ్చినట్లు, ఇతర వ్యక్తిగత కారణాల మీద వచ్చారని అతికీ అతకని కథలు చెబుతున్నారు.

chandrababu kumaraswamy rahul కోసం చిత్ర ఫలితం

పనిలో పనిగా కుమారస్వామి తన వంద రోజుల పాలన పూర్తైన సందర్భం, శ్రావణ శుక్రవారం కావడంతో బెజవాడ దుర్గమ్మను సందర్శించుకున్నారు. ఇటు చంద్ర బాబు కూడా తన బిజీలో తాను ఉన్నారు. తిరుపతిలో టాటా నిర్మించే కేన్సర్ ఆస్పత్రికి భూమిపూజ చేశారు. ఇంత టైట్-షెడ్యూల్ లో కూడా ఇద్దరూ ఏకాంతంగా గంటన్నరసేపు హోటల్ లో చర్చించుకున్నారంటే దాని సారాంశం ఏంటని, ఇదంతా ప్రీ-ప్లాన్డ్ వ్యవహారం కాబట్టే ఇద్దరూ గంటన్నర సేపు తీరిగ్గా ఎవరినీ లోపలకు రానీయకుండా రాచకీయ మంతనాలు సాగించారు. కాంగ్రెస్ దూతగానే కుమారస్వామి చంద్రబాబుని కలిసినట్టు తెలు స్తోంది. కాంగ్రెస్ పొత్తుపైనే వీరిద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుందని అంటున్నారు జనం.

congress tdp alliance కోసం చిత్ర ఫలితం

కర్నాటకలో జెడిఎస్-కాంగ్రెస్ సంకీర్ణం తీరుతెన్నులను, కాంగ్రెస్ సంకీర్ణంలో భాగస్వామ్యం ఎలా? ఉందని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. కుమారస్వామి కున్న కాంగ్రెస్ తో  అనుభవాలన్నీ భవిష్యత్తులో చంద్రబాబుకు చాలా అవసరం. వచ్చే ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ తెచ్చుకోలేమని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు, టీడీపీ జన్మ సిద్ధాంతాలను రాజకీయ అవసరాల కోసం పబ్బం గడుపు కోవటానికి తుంగలో తొక్కేసి కాంగ్రెస్ తో అక్రమకాపురానికి సై అంటే సై అంటు న్నారు.

chandrababu kumaraswamy rahul కోసం చిత్ర ఫలితం 

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నగారా మోగబోతున్న సమయంలో ఇక కాంగ్రెస్ తో పొత్తుకు ఏమాత్రం ఆలస్యం చేయకూడదని చంద్రబాబు భావిస్తున్నట్లని పిస్తుంది. అందుకే కాంగ్రెస్ తో పొత్తు అనుభవంలో శతదినోత్సవం జరుపుకున్న కుమారస్వామి పౌరోహిత్యంలో నిశ్చితార్ధం కోసం వేగంగా ముందుకు అడుగులేస్తున్నారు. చంద్రబాబుతో చర్చించిన విషయాలన్నిటినీ కుమారస్వామి కాంగ్రెస్ అధిష్టానానికి చేరవేస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ తమ నిర్ణయాన్ని తెలపాల్సి ఉంటుంది.

chandrababu kumaraswamy rahul కోసం చిత్ర ఫలితం

ఇక మిగిలిందేమైనా ఉందంటే, అది చంద్రబాబు గారు హసినాపురికేళ్ళి సోనియా పాదాల కడ తెలుగు దేశం పరువు ప్రతిష్ఠలను నైవేధ్యం పెట్టి సాగిలపడటం మాత్రమే అంటున్నారు. అయితే, ఇక్కడ వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుందా? అనేది ప్రజల అనుమానం.

chandrababu kumaraswamy rahul కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: