గురు:బ్రహ్మ, గురు:విష్ణు, గురుదేవో మహేశ్వర:
గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమ:


గురువును పరబ్రహ్మగా భావించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చి వారి గొప్పతనాన్ని కొనియాడారు మన పూర్వికులు. వ్యక్తిత్వాన్ని, నడవడికను, ప్రవర్తనను తీర్చిదిద్ది మనలో మార్పుతీసువచ్చే వాడు గురువు. అందుకే జన్మనిచ్చిన తల్లి, తండ్రిల తర్వాత స్థానం.. గురువుకు ఇచ్చి గౌరవిస్తున్నారు. ఒక దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్లడంలో గురువు పాత్ర ఎంతో  కీలకం. ఒక వ్యక్తి లేదా సమాజం ఉన్నతంగా ఎదగడంలో మంచి గురువు పాత్ర ఎప్పటికీ ఉంటుంది. గురువుకు పూజ చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం... కొందరు గురువులను ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఇలా స్మరించుకుందాం....


 విద్య నేర్చుకోవడానికి ప్రతి వ్యక్తికీ గురువు అవసరం. ఆ గురువే మనిషిలో  సంస్కారాన్ని పెంచి, ఆదర్శవంతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. నేడు మాజీ రాష్ట్రపతి కీర్తిశేషులు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశ అత్యుత్తన్నత పదవిని అలంకరించిన సర్వేపల్లి అందరికీ ఆదర్శనీయుడిగా నిలిచారు.  సెప్టెంబర్ 5న ఎంతో మంది శిష్యులు తమ గురువులను సత్కరించి తమ గురుభక్తిని చాటుకుంటారు. ప్రతివ్యక్తి ఎదుగులలో తల్లిదండ్రలతో పాటు గురువు కూడా కీలకపాత్ర పోషిస్తాడు.


విద్యార్ధి విద్యాభివృద్ధికి తోడ్పాటు నందిస్తాడు గురువు. అందుకే ఏడాదికి ఒకసారైనా గురువును పూజించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం..గురుపూజోత్సావానికి శ్రీకారం చుట్టింది.  ‘గురువును పూజింపుమన్న, సంస్కారమును పెంచుమన్న..’ అన్నారు కొందరు మహానుభావులు. గురువు పట్ల ప్రేమాభిమానాలు, మంచిని పెంచుకుంటూ పోయిననాడు.. సమాజాభివృద్ధి జరుగుతుందనేది పెద్దల మాట.  సర్వేపల్లి రాధాక్రిష్ణన్ (5  సెప్టెంబర్ 1888 –1975) తాత్విక భావాలుకల వ్యక్తి. ఆయన 1962 లో రాష్ట్రపతిగా  నియమితులైనారు.


కొందరు విద్యార్ధులు, స్నేహితులు ఆయన వద్దకు వచ్చి, “రాధాక్రిష్ణన్ గారూ! మీ జన్మదినమును వైభవోపేతంగా మేము నిర్వహిస్తాము” అంటూ రాధాక్రిష్ణన్ యొక్క అనుజ్ఞ కోరారు. అందుకు సర్వేపల్లి రాధాక్రిష్ణన్ ఇలాగ బదులు ఇచ్చారు: నా పుట్టిన రోజు దినమును ప్రత్యేకముగా చేస్తామని మీరందరూ అంటూన్నారు. కానీ, అందుకు  మారుగా ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపే విధంగా, ఈ పండుగను మలచ వచ్చును కదా! సెప్టెంబర్ 5 వ తేదీని ‘టీచర్స్ డే’ గా ఈ పర్వదినం చేస్తే, నాకు అది ఎంతో గర్వకారణం ఔతుందని అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: