డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టిన రోజు(సెప్టెంబర్‌ 5)ని భారతీయులు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్‌ 5న ‘ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం’గా జరుపుతారు. దాదాపు 100 దేశాల్లో జరిగే ఈ వేడుక గురించి తెలుసుకుందాం.   గురువుల బోధనలోనే విద్యార్థులు ప్రపంచాన్ని తెలుసుకుంటారు. ఉన్నత వ్యక్తులుగా ఎదుగుతారు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా తొలి గురువు అమ్మే అయినప్పటికీ ప్రతి ఒక్కరికి తమ జీవితంలో స్ఫూర్తి నింపి, దిశా నిర్దేశం చేసిన గురువంటూ ఒకరుంటారు..వారందరూ అజన్మాంతం స్మరణీయులు. 

 ప్రపంచంలో అనాధిగా గురువులకు ఎంతో గొప్ప స్థానం ఉంది.  ప్రపంచంలో వీరాధి వీరులకు పాఠాలు నేర్పించిన గురువులకు వారు ప్రధమ స్థానాన్ని కల్పించారు.  మహాభారతంలో పాండవులు ద్రోణాచార్యుడికి ఎంత గొప్పస్థానం ఇచ్చారో తెలిసింది.  ఇక ఏకలవ్యుడు తన గురువు గా భావించే ద్రోణాచార్యుడికి  గురు దక్షిణగా ఏకంగా తన బొటనవేలునే త్యాగం చేశారు. చంద్రగుప్తుడు తన గురువు చాణక్యుడిని ఎంతో గొప్ప స్థానంలో ఉంచిన విషయం తెలిసిందే.

ప్రపంచంలో ఎంతో గొప్ప ఉపాధ్యాయులు ఉన్నారు. ..  ఏకల అన్నె సలీవాన్‌, నాన్సీ ఎట్‌వెల్‌, హెలెన్‌ కెల్లెర్‌, అల్బర్స్‌ ఐన్‌స్టీన్‌, అరిస్టాటిల్‌, అయాన్‌ ర్యాండ్‌, గెలీలియో, న్యూటన్‌, పైథాగారస్‌, కన్‌ఫ్యూసియస్‌, సర్వేపల్లి రాధాకృష్టన్‌ మొదలైన వారంతా ఎంతోమందిని తీర్చిదిద్ది మరెంతోమందికి ఆదర్శంగా నిలిచారు. దక్షిణామూర్తి, విశ్వామిత్రుడు, సాందీపుడు, పరుశురాముడు, ఆదిశంకరాచార్యులు, ద్రోణాచార్య, పరమహంస మొదలైనవారి గురుకృపతో ఎంతోమంది ధన్యజీవులైనారు. భారతదేశంలోనే కాదు దేశదేశాల్లో గురువుని ఎంతో గౌరవిస్తారు.

ఇతర తేదీల్లో ... 

  •  మలేషియాలో ‘హరిగురు’ పేరుతో మే 16న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతారు. 
  •  వియత్నాంలో నవంబర్‌ 20న విద్యార్థులు ఉపాధ్యాయుల ఇళ్లకు వెళ్లి పువ్వులిచ్చి గౌరవిస్తారు. 
  •  హాంకాంగ్‌లో సెప్టెంబర్‌ 10న చెక్‌ రిపబ్లిక్‌ దేశానికి చెందిన జాన్‌ కొమినస్‌ ప్రపంచ ఆధునిక విద్యాపితామహునిగా పేరుపొందారు. ఆయన పుట్టిన రోజు(మార్చి28)నే అక్కడ టీచర్స్‌ డే జరుపుతారు. 
  •  అల్బేనియా దేశంలో 1867 మార్చి 7న మొదటి పాఠశాలను స్థాపించి తొలి పాఠాలు బోధించారు. అందువల్ల ఈ దేశంలో మార్చి 7న ఉపాధ్యాయ దినోత్సవాన్ని చేసుకుంటారు. 
  •  ఆస్ట్రే‌లియాలో- అక్టోబర్‌ ఆఖరు శుక్రవారం 
  •  ఇండోనేషియాలో -నవంబర్‌ 25 
  •  మలేషియాలో - మే 16 
  •  సింగపూర్‌లో - సెప్టెంబర్‌ 1 
  •  యునైటెడ్‌ స్టేట్స్‌లో - మే మొదటి వారం 
  • యూఏఈ, సౌదీ ఆరేబియా, ఈజిప్ట్‌, సిరియా, అల్జీరియా దేశాల్లో ఫిబ్రవరి 28న ఇలా వివిధ దేశాల్లో ఆ తేదీల్లో ఉన్న ప్రాధాన్యతను బట్టి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: