Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Sep 23, 2018 | Last Updated 3:39 pm IST

Menu &Sections

Search

ప్రగతి నివేదనతో తెచ్చుకున్న శత్రుత్వం - నెటిజెన్స్ లో కనిపిస్తున్న ఉద్వేగం జనంలో కనిపిస్తే?

ప్రగతి నివేదనతో తెచ్చుకున్న శత్రుత్వం - నెటిజెన్స్ లో కనిపిస్తున్న ఉద్వేగం జనంలో కనిపిస్తే?
ప్రగతి నివేదనతో తెచ్చుకున్న శత్రుత్వం - నెటిజెన్స్ లో కనిపిస్తున్న ఉద్వేగం జనంలో కనిపిస్తే?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
"ప్రగతి నివేదన సభ" ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నాటి నుంచి మంత్రి హరీష్ రావు పేరు ప్రతి చోటా వినిపించింది. దీనికి తగ్గట్టు ఆయన ఊసేక్కడా కూడా కనిపించ లేదు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తెలంగాణా రాష్ట్రంలో  టిఆరెస్ ప్రభుత్వ ఏర్పాటు వరకూ ప్రతి కార్యక్రమంలో హరీష్ రావు చొరవ కొట్టొచ్చినట్లు కనిపించేది.  దీనికి భిన్నంగా గడిచిన కొద్దికాలంగా, హరీష్ రావును ఆయన జిల్లాకు పరిమితం చేయటం తెలిసిందే. "ప్రగతి నివేదన సభ" తో కెసిఆర్ పై ఇంట్లోనే అసంతృప్తి జ్వాలను కేసిఆరే స్వహస్తాలతో అగ్గిరవ్వతో అంటించినట్లైంది. 

telangana-news-pragati-nivedana-sabha-pragati-niro

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు మంత్రి హరీష్ రావును దూరం పెట్టారా? అంటే అవును అనే అంటున్నాయి తెరాసలోని ఆయన వర్గాలు. మంత్రి కేటీఆర్ అన్నిటా తానై సభ ఏర్పాట్లలో బిజిగా ఉండగా, సీనియర్ మంత్రి హరీష్ రావు ఇవేమి అంటీ ముట్టనట్టు తన నియోజకవర్గంలోను, పక్క నియోజకవర్గం లోను పర్యటిస్తున్నారు.

telangana-news-pragati-nivedana-sabha-pragati-niro

ముందస్తు ఎన్నికలకు సన్నాహంగా నిర్వహిస్తున్న ఈ సభ విజయవంతం చేసి దానిని కేటీఆర్ ఖాతాలో వేయ్యాలని పథకం. దానికోసమే వ్యూహాత్మకంగా హరీష్ రావును పక్కన పెట్టారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు అన్ని ఉప ఎన్నికలలో హరీష్ రావుకు విశేష ప్రాధాన్యత ఇచ్చారు, ఆ తర్వాత తగ్గింది, ఇప్పుడు సభ ఏర్పాట్ల కమిటీలో కూడా హరీష్ రావుకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదు.గ్రేటర్ హైదరాబాద్ కు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సందర్భం లోనూ మంత్రి కేటీఆర్ ను ప్రమోట్ చేయటం, హరీష్ రావును పూర్తిగా పక్కన పెట్టటం అనేకంటే నిర్లక్ష్యం చేయటం అప్పట్లో వివాదాస్పద  విషయంగా, చర్చనీయాంశంగా, హాట్-టాపిక్ గా మారింది. ఆ తర్వాత కూడా హరీష్ రావును పక్కన పెట్టటం కేటీఆర్ ను ప్రమోట్ చేయటం అనియంత్రితంగానే జరిగి పోయింది.  తన తర్వాత, తన రాజకీయ వారసుడు కేటీఆర్ అన్న విషయాన్ని తన నిర్ణయాలతో ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్. అదే రాజవంశంలో ఇరువురు హేమాహెమాల మద్య అఘాదం స్వయానా మహరాజే సృష్టించి నట్లైంది.  


దీనికి తగ్గట్లే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు కేటీఆర్ కు ప్రాధాన్యత లభించటం హరీష్ రావు ఊసే లేకపోవటమనేది మాత్రం యాదృచ్చికం కాదు. ఇది అంతకంతకూ పెరుగుతూ నేడు తాజాగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సదస్సులో విశ్వరూపం సంతరించుకొంది. ప్రగతి నివేదన సభ మొత్తం కేటీఆర్ కేంద్రంగా సాగటం జరిగింది. హరీష్ రావుకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవటంపై ఆయన వర్గంలో ఆగ్రహం పెల్లుబికిందన్న విషయం పరిచయం ఉన్న వారికి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.  ఆశ్చర్యకరంగా ఎప్పుడూ ఎన్నడూ లేనట్లుగా  "సోషల్ మీడియా లోనూ హరీష్ రావు మీద సానుభూతి వెల్లువైంది"  టీఆర్ఎస్ లో మొదట్నించి కష్టపడి పనిచేసిన హరీష్ రావును అతి సునాయాసంగా కూరలో కరివేపాకులా పక్కన పెట్టేయటా న్నెవరూ సహించలేక పోతున్నారు. ఇంత దుర్మార్గం ఏమిటన్న ప్రశ్న చాలామంది సభాసదుల్లో నుండే వినిపించింది. టీఆర్ఎస్ కు ట్రబుల్ షూటర్ అయిన హరీష్ రావును తాజా సభ విషయంలో పక్కన పెట్టేయటంతో ఆయన వర్గానికి చెందిన నేతలు ఎవరూ చురుకుగా స్పందించటం లేరనేది అందరికీ విదితమే. అధినేత కెసిఆర్ ఆగ్రహానికి గురికాకుండా ఉండేలా సభా ఏర్పాట్లలో పాల్గొన్నారే కానీ మనసుపెట్టి చేయలేదన్న మాట వినిపిస్తోంది.

telangana-news-pragati-nivedana-sabha-pragati-niro
ఇదిలా ఉంటే, ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించిన కేబినెట్ సమావేశం తర్వాత,  సమావేశంలో నిర్వహించిన అంశాల్ని వెల్లడించేందుకు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశ మందిరం లోకి తొలుత హరీష్ రావు రావటం, ఆయన వెనుక వరుసగా పలువురు మంత్రులు వచ్చారు. అందరితో పాటు హరీష్ రావు ఒకరుగా కనిపించారే తప్ప  ఆయనకు ఎలాంటి ప్రత్యేకతగాని ప్రాముఖ్యతగాని ఉన్నట్లు కన్నిపించలేదు.
telangana-news-pragati-nivedana-sabha-pragati-niro
తనకు అప్పగించిన నాలుగు మాటలు మాట్లాడిన హరీష్ రావు మౌనంగా ఉండి పోయారు తప్ప ముఖంలో సాధారణ చురుకుదనం కనిపించలేదు. ప్రగతి నివేదన సభ వేదిక మీద కూర్చున్న హరీష్ రావు వైపు కెమేరాలు ఎక్కువసేపు పోకస్ చేయటం కూడా  కనిపించింది. కొంత  గంభీరంగా ఉన్నట్లుగా హరీష్ రావు కనిపించారు.ఎప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే హరీష్ రావు అలా నేడు లేకపోవటం, ఇంత పెద్ద బహిరంగ సభ నేపథ్యంలో కనిపించాల్సిన హడావుడి, సందడి సందోహం గాని  ఆయనలో అస్సలేమీ చూపరులకు కనిపించలేదు.
telangana-news-pragati-nivedana-sabha-pragati-niro
నిస్సారంగా నిస్తేజంగా - తేజస్సు కోల్పోయిన రీతిలో హరీష్ రావు కనిపించారు. అదే సమయంలో, మంత్రి కేటీఆర్ చెమటలు కారుతూ, ముఖం అలసటతో బహుభారం మోస్తున్న వానిలా భారంగా ఉండటం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. "ప్రగతి నివేదన సభ" లో హరీష్ రావుకు ప్రాధాన్యత యివ్వలేదన్న విషయం, ఆయనకు కేటాయించిన విధుల్ని చూస్తే అర్థమవుతుందని అంతర్జాలం వెల్లువెత్తుతుంది. 

telangana-news-pragati-nivedana-sabha-pragati-niro

ముందస్తు ఎన్నికలలో తెరాస భారీ విజయం సాధిస్తే, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తారని సమాచారం. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో ఏర్పాటు కాబోయే తరువాతి ప్రభుత్వం కీలక భూమిక పోషించాలని ఆయన వ్యూహం.

telangana-news-pragati-nivedana-sabha-pragati-niro
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆంధ్రప్రదెశ్ లో టిడిపి ఓటమికి బలమైన రాజకీయ వ్యూహం:  BJP రాం మాధవ్
నిజమా? చంద్రబాబు వెళ్ళేది యుఎన్ అసెంబ్లికి కాదా!  ఏమిటీ తమాషా? మరి ఎందుకీ బూటకాల నాటకాలు?
ఇంటి పేరుతో పబ్బం గడుపుతున్న రాహుల్ అంతకు మించి ఎలాంటి అర్హత సామర్ధ్యం లేవు!
నరేంద్ర మోడీ రాజకీయ వ్యక్తిగత జీవితంపై రాఫేల్ అవినీతి మరక !
భారత్ - పాక్ రాజకీయమైనా, సినిమాలైనా చివరకు క్రీడలైనా - ఇది దాయాది పోరు కదా!!!
‘ఓటు కు నోటు కేసు’ ఈడీ  ఉచ్చు  బిగిస్తుందా?
చంద్రబాబు స్వంత భవనాల నిర్వహణ సిసిటివీలు, కెమెరాల భారం ఉభయ రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలకే తలనొప్పా?
చంద్రబాబుకు షాక్!  మీకెవరికి స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండవు: ధర్మాబాద్ కోర్ట్
టిఆరెస్ ఒటమికి కాంగ్రెస్ పాదాల చెంత మోకరిల్లటానికి టిడిపి సిద్దమౌతుంది : 10 సీట్లు చాలు టిడిపి
చింతమనేని టిడిపికి మోహం - కాని - తెలుగు జాతికి శిరోభారం
మంత్రి లోకెష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం - పెయిడ్ ఆహ్వానం ఖర్చు తడిసి మోపెడు? ప్రయోజనం?
మన టాలీవుడ్ హీరోల సామాజిక బాధ్యత సృహ లో హాస్యం రసవత్తరం
గోదావరి పుష్కరాల్లో జనహననంపై - రిటైర్డ్ జడ్జ్ సోమయాజులు నివేదిక రాసిందెవరు?
డిల్లీలో నరెంద్ర మోడీ దెబ్బ - గోల్కొండలో ఒవైసీలు అబ్బా!
రాజకీయ వర్షంలో తడిసిపోనున్న మిర్యాలగూడా కులం బాధితురాలు అమృతవర్షిని
టిఆరెస్ స్పీడ్ - మహాకూటమి బేజార్!  కూటమికి పురిట్లోనే సంధి కొడుతుందా?
బిజెపి రాష్ట్రాన్ని ముంచింది - కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ లోటు భర్తీ అవుతుంది: రాహుల్ గాంధి
ఎమెల్యే ఆర్కె రోజాపై చేసిన ధారుణ వ్యాఖ్యలకు టిడిపి ఎమెల్యే బోడే ప్రసాద్ కు హైకోర్ట్ షాక్
About the author