వందల కోట్లు ఖర్చు చేసి తెలంగాణ అధికార పార్టీ భారీ సభను జరిపించింది అయితే ఇంత ఖర్చు చేసి లక్షల మందిని తీసుకొచ్చినారు.అయితే కేసీఆర్ ఎదో వరాల జల్లు కురిపిస్తాడని అందరూ అనుకున్నారు కానీ అలాంటిదేమీ జరగలేదు.  హైదరాబాద్ జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉదయాన్నే వచ్చేసిన వారందరికీ ఉండడానికి ఏర్పాట్లుచేసారు. అక్కడ తిండి, ఇంతరత్రా సామగ్రి సమకూర్చారు. ఒక మనిషికి కనీసం 2000 రూపాయిలు ఖర్చయి వుంటుందని అంచనా.

Image result for pragathi nivedana sabha

ఎందుకంటే ఇవ్వాళ, రేపు వెయ్యి రూపాయలు ఇవ్వకుండా ఎవ్వరూ రాజకీయ సభలకు రావడంలేదు. పైగా బిరియానీ, క్వార్టర్ మందు అన్నది అదనపు ఖర్చులు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఖర్చు కామన్. ఇదికాక ట్రాన్స్ పోర్ట్ అదనం. రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ రవాణా సదుపాయాలు అంటే ఖర్చు కోట్లలోనే వుంటుంది. ఇక దీనికితోడు పబ్లిసిటీకి భీకరంగా ఖర్చుచేసారు. ప్రతి పత్రికలో టికెట్ ఆశావహులు పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చారు. ఇవి చాలాదన్నట్లు టీవీల్లో ప్రచారం. దాదాపు అన్ని చానెళ్లకు కనీసంలో కనీసం మూడులక్షల నుంచి కోటి వరకు ప్యాకేజ్ లు ఇచ్చారని వినికిడి.

Image result for pragathi nivedana sabha

శనివారం, ఆదివారం, సోమవారం చానెళ్లలో ప్రగతి నివేదన వ్యవహారాలే పాజిటివ్ గా హోరెత్తాలన్నది కండిషన్ గా తెలుస్తోంది. దీంతో చానెళ్లకు పండగే పండగ అన్నట్లు అయింది. ప్రింట్ మీడియాకు కూడా యథాశక్తి ప్రకటనలు అందాయి. ఈనాడు లాంటి అగ్రశ్రేణి దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో మూడు వంతుల స్థలాన్ని కేటీఆర్ స్వయంగా రాసిన ఆర్టికల్ కు కేటాయించారు.  ఇంతా ఖర్చుచేసి  కేసీఆర్ చేసిన స్పీచ్ లో కొత్త పాయింట్లు కరువయ్యాయి. నిత్యం పత్రికల్లో చూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలనే ఏకరవు పెట్టారు. పెద్దగా సంచలన ప్రకటన ఏదీ చేయలేదు. నిర్ణయాలు ప్రకటించలేదు. దానికితోడు  కేసీఆర్ స్టయిల్ పంచ్ లు వినిపించలేదు. దీంతో ఈ మాత్రం దానికి ఇంత హడావుడి ఎందుకు? ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడినట్లు వుంది తప్ప వేరుకాదు అని కామెంట్లు వినిపించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: