ఇంతవరకూ యాంటీ ఇంకంబెన్సీని బయటకు కనిపించకుండా మీడియా మేనేజ్మెంట్ ద్వారా నెట్టుకువస్తున్న టీడీపీకి గడ్డు రోజులే అంటున్నారు. ఆ పార్టీతో నాలుగేళ్ళుగా ఉన్న సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి వైసీపీలో చేరడంతో వలసలు మొదలయ్యాయాన్న టాక్ వినిపిస్తోంది. ఇది ఆరంభమే అని, ముందుంది ముసళ్ళ పండుగ అని చెబుతూండడంతో పసుపు పార్టీలో సెగలు రగులుతున్నాయి.


ఇపుడే స్టార్ట్ అన్న జగన్ :


వైసీపీలోకి వలసలకు శుభారంభం జరిగిందని జగన్ అంటున్నారు. ఆనం ని చేర్చుకున్న తరువాత ఆయన మాట్లాడుతూ ఇకపై సైకిల్ దిగే వారే కనిపిస్తారని చెప్పుకొచ్చారు. ప్రజా వ్యతిరేక విధానలకు పాల్పడుతున్నా టీడీపీలో ఎవరూ ఉండరని కూడా అన్నారు. ఆ పార్టీ విధానాలు నచ్చకే తమ వద్దకు వస్తున్నారని జగన్ అంటున్నారు. చూడబోతే జగన్ ద్రుష్టి మరెందరి మీద ఉందో అన్న చర్చ మొదలైంది.


లిస్ట్ పెద్దదేనా:


ఇప్పటికే పలు జిల్లాల్లో అసంత్రుప్తి సెగలతో సైకిల్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరో వైపు ప్రజా  వ్యతిరేకత అంతకంతకు పెరుగుతోంది. ఎన్నికలు నెలల వ్యవధిలోకి వచ్చేశాయి. ఈ టైంలో ఆనం చేరికతో రివర్స్ వలసలకు తెర తీసారని అంటున్నారు. ఇదే బాటలో చాలా మంది వైసీపీ శిబిరం వైపుగా రావచ్చునని టాక్ నడుస్తోంది. అది మనసులో ఉంచుకునే జగన్ వలసలు  మొదలయ్యాని కీలక వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు.  దీంతో వైసీపీలోకి ఫిరాయించే వారి లిస్ట్ పెద్దదే అనిపిస్తోంది.


ఫిరాయింపులకు నో :



ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలు చాల మంది తిరిగి వైసీపీలోకి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. అయితే ఎట్టి పరిస్థితులలోనూ వారిని చేర్చుకోబోమని జగన్ అంటున్నారు. సైకిల్ పార్టీలో ఉన్న తమ్ముళ్ళలో నచ్చిన వారినే ఆయన రమ్మంటున్నారు. దీంతో చాల మందికి రావాలని ఉన్నా కుదరడం లేదంటున్నారు. మొత్తానికి రానున్న రోజులలో రివర్స్ వలసలతో అధికార పార్టీని టెన్షన్ లో పెట్టేందుకు జగన్ రెడీగా ఉన్నట్లు భోగట్టా.



మరింత సమాచారం తెలుసుకోండి: