Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 7:01 am IST

Menu &Sections

Search

ఏపీ మంత్రుల్లో సేఫ్ ఎవ‌రు... డేంజ‌ర్ ఎవ‌రు..!

ఏపీ మంత్రుల్లో సేఫ్ ఎవ‌రు... డేంజ‌ర్ ఎవ‌రు..!
ఏపీ మంత్రుల్లో సేఫ్ ఎవ‌రు... డేంజ‌ర్ ఎవ‌రు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. ఏ నలుగురు కలిసి మాట్లాడుకున్నా.. రాజకీయాల గురించే టాఫిక్ నడుస్తోంది. రాబోయే ఎన్నికలల్లో త్రిముఖ పోరుతో హోరాహోరీగా పార్టీలు తలపడనుండడంతో ఇప్పటి నుంచే పార్టీలు సందడి మొదలెట్టేశాయి. అయితే ఏ పార్టీ ఇందులో పై చేయి సాధిస్తుంది అనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఈ సమయంలోనే పార్టీల్లో జంపింగ్ జపాంగ్ ల సందడి కూడా బాగా కనిపిస్తోంది. అయితే అధికార పార్టీకి చెందిన మంత్రుల భవిష్యత్తు వచ్చే ఎన్నికలనాటికి ఎలా ఉండబోతోంది ..? వారిలో ఎంతమంది గెలిచే ఛాన్స్ ఉంది అనే లెక్కలు ఇప్పుడు చర్చలకు దారి తీస్తున్నాయి. 

andhrapradesh-minister-jumping-tdp-ysrcp-congress-

ఏపీ క్యాబినెట్లో మొత్తం చంద్రబాబు తో కలిపి 23 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో నలుగురు ఎమ్మెల్సీగా ఉండి మంత్రులు కాగా..మిగిలిన వారు ఎమ్యెల్యేలుగా గెలిచి  ఎన్నికై మంత్రి పదవులు చేపట్టారు. ప్రస్తుతం..ఎమ్మెల్సీలుగా ఉండి మంత్రులైన నలుగురిలో ముగ్గురు ఎన్నికల్లో పోటీ చేస్తారు. వీరిలో ఐటి మంత్రి నారా లోకేష్‌' కూడా ఉన్నారు. ఆయన చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేస్తారు. ఇక మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ నెల్లూరు నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.వైసీపీ బలంగా ఉన్న ఈ జిల్లాలో మంత్రి నారాయణ గెలవడం ఆషామాషీ విషయం కాదు. మరో మంత్రి 'సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి' కూడా ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే ధ్యేయంతో ఉన్నారు. స్థానిక స‌మీక‌ర‌ణ‌లు చూస్తుంటే ఆయ‌న గెలుపు కూడా క‌ష్టంగానే ఉంది.

andhrapradesh-minister-jumping-tdp-ysrcp-congress-

అలాగే టీడీపీ సీనియర్ మంత్రి  యనమల రామకృష్ణుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. తునిలో ఆయ‌నే కాదు... ఆయ‌న ఫ్యామిలీలో ఎవ‌రు నిల‌బ‌డినా గెలిచే ప‌రిస్థితి లేదంటున్నారు. అలాగే టీడీపీ మంత్రుల్లో కీలకంగా ఉన్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అచ్చెనాయుడు, మరో మంత్రి కళా వెంకటరావులు గెలిచే అవకాశం ఉన్నట్టు కొన్ని సర్వేలు కూడా స్పష్టంగా తేల్చాయి. వీరు శాఖా ప‌రంగా ఎలా ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో చేసిన అభివృద్ధి వారికి క‌లిసి రానుంది. అలాగే... విజయనగరం జిల్లా నుంచి మంత్రివర్గంలో పనిచేస్తున్న సుజయ రంగారావు కూడా గెలిచేవారిలో ఉన్నారు. ఆయనకు నిజాయితీపరుడిగా పేరుంది. 


ఇక విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మరో మంత్రి అయ్యన్నపాత్రుడు మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ల‌ల్లో వాళ్లు ఎంత తిట్టుకున్నా... ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వారికి ఉన్న గ్రిప్పే కార‌ణం. తూర్పుగోదావరి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఉన్న 'యనమల' నేరుగా ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. హోంమంత్రి చినరాజప్ప పరిస్థితి కొంచెం క్లిష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన ప్రభావం ఆయన గెలుపు పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.  


పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు 'పీతాని సత్యనారాయణ, జవహర్‌ల‌లో జ‌వ‌హ‌ర్‌కు కాస్త సానుకూల‌త ఉండ‌గా.... పితాని తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనే చావుత‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా గెలిచిన ఆయ‌న ఈ సారి గెలుస్తాడా ?  లేదా ? అన్న‌ది సందేహ‌మే. అయితే ఇక్క‌డ వైసీపీ అభ్య‌ర్థి ఈక్వేష‌న్ మార‌డంతో పితానికి మ‌ళ్లీ ప్ల‌స్ అయ్యే ఛాన్స్ కూడా కొట్టిప‌డేయ‌లేం. ఇక జ‌వ‌హ‌ర్ స్థానికంగా ఉన్న గ్రూపు త‌గాదాలు ప‌రిష్క‌రించుకోవాల్సి ఉంది.

andhrapradesh-minister-jumping-tdp-ysrcp-congress-

కృష్ణా జిల్లాలో రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు  వ్యక్తిగతంగా, పార్టీ పరంగా..ఆయనపై ఎటువంటి విమర్శలు లేకపోయినా..ఆయన ప్రత్యర్థి ఆర్థికంగా బలవంతుడు కావడం...కోట్ల రూపాయలను వెదజల్లుతూ..అన్ని వర్గాలను ఆకర్షిస్తుండడంతో...'దేవినేని' గట్టిపోటీని ఎదుర్కోబోతున్నారు. అయితే స్వల్ప మెజార్టీతో అయినా గెలిచే అవకాశం కనిపిస్తోంది. మరో మంత్రి కొల్లు రవీంద్ర ఈసారి గెలిచే ఛాన్స్ కనిపించడంలేదని, ఆయనపై నియోజకవర్గ ప్రజలు గుర్రుగా ఉంటున్నారని టాక్. 


గుంటూరు జిల్లా నుంచి మంత్రి వర్గంలో కొనసాగుతున్న రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మొన్నటి వరకు సులువుగానే గెలుస్తారని భావించారు. కానీ..అనూహ్యంగా ఆయనకు విడుదల రజని కుమారి అనే ఎన్నారై మహిళ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో పుల్లారావు లో టెన్షన్ మాములుగా లేదు.  అలాగే  రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి 'నక్కా ఆనందబాబు' గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో గెలుపొందారు. ఈ సారి ఆయన గెలవడం అంత సులువు కాదనే మాట వినిపిస్తోంది. 


ప్రకాశం జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న శిద్ధారాఘరావు గెలుపు అంత సులువు కాదనే ప్రచారం జరుగుతోంది.  అసలు ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం కనిపించడంలేదు. కర్నూలు జిల్లా నుంచి మంత్రి వర్గంలో కొనసాగుతున్న సీనియర్‌ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. మరో మంత్రి అఖిలప్రియ' గెలుపు కష్టమనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అసలు ఆమె పార్టీలో ఉంటారా లేక వేరే ఈదిన పార్టీలో చేరుతారో తెలియక అంత ఉత్కఠగా ఎదురు చుస్తునారు. 


కడప జిల్లాలో మంత్రి ఆదినారాయణరెడ్డికి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సహకరిస్తే గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది.  అనంతపురం జిల్లాలో మంత్రులుగా ఉన్న పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు పరిస్థితి కూడా కష్టంగానే ఉంది. వీరిలో పరిటాల సునీత గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఆమె మళ్లీ గెలిచే అవకాశం స్వల్పంగానే ఉన్నట్టు సర్వ్ లెక్కల్లో తేలింది. మరో మంత్రి 'కాల్వ 'పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఆయనకు టిక్కెట్‌ రాకుండా..ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అమర్‌నాథ్‌రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వీరు ఖచ్చితంగా గెలుపు గుర్రాలే. ఏదేమైనా మంత్రుల్లో ఓ 8 మంది వ‌ర‌కు కాస్త డౌట్‌లోనే ఉన్నారు. మ‌రి ఎన్నిక‌ల వేళ ఈ పరిణామాలు ఎలా మార‌తాయో ?  చూడాలి.


andhrapradesh-minister-jumping-tdp-ysrcp-congress-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లేని దానికోసం జ‌గ‌న్ ఉన్న‌ది పోగొట్టుకుంటున్నారా..!
చంద్ర‌బాబు చుట్టూ ఫీల్డింగ్‌.. సెంచ‌రీనా.. ఔటా..!
కృష్ణాలో రెండు వైసీపీ టికెట్లు డౌన్‌
వైసీపీ-టీడీపీ సేమ్ రేటింగ్‌... రీజ‌న్ ఇదే...!
ఏపీలో పొలిటిక‌ల్ ఎమ‌ర్జెన్సీ ... ఏం జ‌రుగుతోంది.. !
టీడీపీలోకి వైఎస్ బ‌ద్ధ శ‌త్రువు... !
టీఆర్ ఎస్‌తో ఏపీకి న‌ష్ట‌మెంత‌..!
కేసీఆర్-జ‌గ‌న్ కూట‌మిపై ఎందుకింత హ‌డావుడి
కేటీఆర్‌-జ‌గ‌న్ భేటీ... ఆ ర‌హ‌స్య అజెండా ఇదేనా..!
బాబును జ‌గ‌న్ మార్క్ షాక్ .... ఈ నెల‌లోనే ముహూర్తం...!
టీడీపీ గెలిస్తే ఒకే.. లేక‌పోతే...  సీనియ‌ర్ల ఆస‌క్తిక‌ర‌చ‌ర్చ‌...!
టీడీపీ త్రిమూర్తుల‌తో గుడివాడ‌లో కొడాలికి స్కెచ్...!
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.