పెట్రోలు ధ‌ర‌లు మండిపోతున్నాయి. ప్ర‌తీ రోజు పెరిగ‌ట‌మే త‌గ్గ‌ట‌మ‌న్న‌ది తెలీద‌న్న‌ట్లుగా ఉంది ప‌రిస్ధితి. ఈరోజు హైద‌రాబాద్ లో పెట్రోలు లీట‌రుకు రూ. 84.10 పైస‌లు.  పెట్రోలు ధ‌ర‌లు పెర‌గ‌టానికి అంత‌ర్జాతీయ క్రూడాయిల్ బ్యారె్ ధ‌రలు పెర‌గ‌ట‌మే అని కేంద్ర‌ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌ర్ధింకుంటోంది. అయితే అంత‌ర్జాతీయంగా క్రూడాయిల్ బ్యారెల్ ధ‌ర‌లు త‌గ్గిన‌పుడు మాత్రం మ‌న‌దేశంలో ఆయిల్ ధ‌ర‌ల‌ను కేంద్రం త‌గ్గించ‌టం లేదు. ఆ విష‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌స్తావించిన‌పుడు కేంద్రం స‌మాధానం చెప్ప‌కుండ త‌ప్పించుకుంటోంది.


ఎప్పుడూ పెర‌గ‌ట‌మే

Image result for oil price hike

ఇదే పెట్రోలు ధ‌ర‌లు యూపిఏ హయాంలో పెరిగిన‌పుడు మాత్రం భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు దేశంలో చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు.  అప్ప‌ట్లో పెరిగుతున్న పెట్రోలు ధ‌ర‌ల‌కు నిర‌సన‌గా బిజెపి నేత‌లు పార్ల‌మెంటుకు ఎడ్ల బండ్ల‌లో వ‌చ్చిన సంగ‌తి అందిరికీ గుర్తుండే ఉంటుంది. యూపిఏ హ‌యాంలో పెట్రోలు ధ‌ర‌లు పెరిగినా ఇపుడు ఎన్డీఏ హ‌యాంలో పెరుగుతున్న అంత‌ర్జాతీయ ధ‌ర‌ల‌ను అనుస‌రించే పెరుగుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. 


జిఎస్టీ ప‌రిధిలోకి వ‌స్తుందా ?


అయితే, యూపిఏ హ‌యాంలో క‌న్నా క్రూడాయిల్ బ్యారెల్ ధ‌ర‌లు ఇపుడు బాగా ప‌డిపోయాయి. కానీ దేశంలో ఆయిల్ ధ‌ర‌లు మాత్రం అప్ప‌టి క‌న్నా ఇపుడు ఎక్కువ‌గా ఉండ‌ట‌మే విచిత్రం. హైద‌రాబాద్ లో క‌న్నా పెట్రోలు ధ‌ర‌లు ముంబాయ్ లో మాత్ర‌మే ఎక్కువ‌. మిగిలిన మెట్రోన‌గ‌రాలైన బెంగుళూరు, చెన్నై కోల్ క‌త్తా, ఢిల్లీలో త‌క్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఒక‌వైపు ఆయిల్ కంపెనీలు లాభాల్లో ఉన్న ధ‌ర‌లను మాత్రం పెంచేస్తున్నాయి. అందుక‌నే ఆయిల్ ను కూడా జీఎస్టీ ప‌రిధిలోకి తేవాల‌ని జ‌నాలు డిమాండ్ చేస్తున్న‌ది.  ఇదే ప‌ద్ద‌తిలో పెట్రోలు ధ‌ర‌లు పెరుగుతూ పోతే తొంద‌ర‌లో లీట‌ర్ పెట్రోలు ధ‌ర 100 రూపాయ‌ల‌కు ట‌చ్ అయినా ఆశ్చ‌ర్య పోవ‌క్క‌ర్లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: