అలెగ్జాండ‌ర్‌ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన‌ చంద్ర‌బాబు.. ఇందేమిటీ.. అలెగ్జాండ‌ర్‌ది ఏ కాలం.. బాబుగారిది ఏ కాలం.. ఏమైనా మ‌తి ఉండే మాట్లాడుతున్నారా..?  బొత్తిగా బుద్ధి లేన‌ట్టుంది..?  అని మాత్రం కోపం చేయ‌కండి.. ఎందుకంటే.. ఈ మాట‌లు చెప్పింది మ‌రెవ‌రో సామాన్య వ్య‌క్తో.. చ‌దువురాని వారో.. చ‌రిత్ర‌తెలియ‌ని వారో కాదు.. స్వ‌యంగా మ‌న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబేనండీ.. బాబుగారు ఇలా అన్నారో లేదో.. వెన‌కాముందు ఆలోచించ‌కుండా.. త‌మ్ముళ్లు ఆన‌వాయితీగా గ‌ట్టిగా చ‌ప్ప‌ట్లు కొట్టేశారు. ఒక‌వేళ త‌మ్ముళ్లు చ‌ప్ప‌ట్లు కొట్ట‌కున్నా.. త‌మ్ముళ్లూ.. గ‌ట్టిగా చ‌ప్ప‌ట్లు..! అంటూ ఇష్టంగా కొట్టించుకునేవారే లెండి..! ఎందుకంటే.. ఇండియాకు అలెగ్జాండ‌ర్‌ని ప్రెసిడెంట్ చేసిన త‌ర్వాత ఆ మాత్రం కొట్ట‌క‌పోతే బాగోదు మ‌రి..! ఇప్పుడ ఎక్క‌డ చూడూ ఇదే ముచ్చ‌ట వినిపిస్తోంద‌ట‌. 


అయితే.. బాబుగారు.. ఇలా కొత్త‌కొత్త విష‌యాలు క‌నిపెట్టి తెలుగు ప్ర‌జ‌లను తెలివిమంతుల్ని చేయ‌డం ఇదే మొద‌టిసారి కాదులేండి. గ‌తంలోనూ ఇలా ఎన్నో విష‌యాలు చెప్పారు. గతంలోనూ బ్రిటీషర్లతోనూ పోరాడింది ఒక్క టీడీపీనే అని కూడా ఆయ‌న సెల‌విచ్చారు. ఇప్పుడు అలెగ్జాండర్ వంతు వచ్చింది. ఇదొక్కటే కాదు..చంద్రబాబు నోటి నుంచి జాలువారిన విజ్ఞాన మాట‌లు ఎన్నో ఉన్నాయి. తాజా విష‌యాన్ని ఆయ‌న ఎక్క‌డ వెల్ల‌డించారంటే.. ఇటీవ‌ల గుంటూరులో నిర్వ‌హించిన మైనారిటీ స‌భ‌లో ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. 


అదేలాగంటే.. అలెగ్జాండర్’ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారట. ఈ దేశానికి అన్ని విధాలుగా అర్హత కలిగిన వ్యక్తి ఆయనే ఉండాలని చెప్పా. ప్రధాన మంత్రిని ఒఫ్పించి..దేశ అధ్యక్ష పదవికి సహకరించిన ఏకైక పార్టీ టీడీపీనే అని చెప్పారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు చెప్పాల్సిన చంద్రబాబు ఏకంగా అలెగ్జాండర్ ను దేశ రాష్ట్రపతిని చేశామని చెప్పటంతో ఈ వీడియోని చూసిన వారంతా అవాక్కు అవుతున్నారు. ఇలా చంద్ర‌బాబు ఏదో ఒక సంద‌ర్భంలో నెటిజ‌న్ల‌కు దొరికిపోతూనే ఉన్నారు. 


ఇప్పుడీ వీడియో క్లిప్పింగ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. నెట్టింట్లో సంద‌డి చేస్తోంది. ఇక చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేశ్‌ది దీనికి సంబంధించిన పెద్ద ఎపిసోడ్ న‌డిపించ‌వ‌చ్చు. తెలుగు రాదు.. నోరు తిర‌గ‌దు.. అన్న బిరుదుకు అంటిపెట్టుకున్న మంత్రి లోకేశ్ ఇలా ఎన్నో సార్లు నోరు జారుతూనే ఉన్నారు. ఇలా తండ్రీకొడుకులు పెద్ద‌పెద్ద టైమింగ్ కామెడీ బాంబులు పేల్చుతూ తెలుగు ప్ర‌జ‌ల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తున్నారు. ఎప్పుడూ ఎంతో సీరియ‌స్‌గా ఉండే.. చంద్ర‌బాబులో ఈ కామెడీ టైమింగ్ క‌నిపించ‌డం విశేష‌మే మ‌రి. త‌మ్ముళ్లూ.. గ‌ట్టిగా చ‌ప్ప‌ట్లు..!


మరింత సమాచారం తెలుసుకోండి: