ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొత్త రాజకీయ ప్రత్యర్ధి తోడయ్యారు. నిన్నటి వరకూ అరకు ఎంపీగా ఉన్న కొత్తపల్లి గీత ఇపుడు జన జాగ్రుతి పార్టీ అధినేత్రి అయ్యారు. ఆ పార్టీ తరఫున ఆమె బాబుని టార్గెట్ చేస్తున్నారు. ఏపీలో పాలనే లేదంటూ నిప్పులు చెరిగారు. అన్నిటా రాజకీయమే అజెండాగా మారిందని దుయ్యబెట్టారు.


గిరిజనులకు అర్హత లేదా :


బాబు క్యాబినెట్ లో మంత్రి అయ్యే అర్హత గిరిజనులకు లేదా అంటూ కొత్తపల్లి గీత మండిపడ్డారు. తన పార్టీని ఈ రోజు విశాఖలో అనుచరులకు పరిచయం చేశారు. పనిలో పనిగా బాబుపైన విరుచుకుపడ్డారు. గిరిజనులపై నోటితో ప్రేమ చాటుకుంటున్న బాబు చేతల్లో మాత్రం చుక్కలు చూపిస్తున్నారని సెటైర్లు వేశారు. ఒక్కరు కూడా మాలో లేరా మంత్రి పదవికి అంటూ సూటిగా నిలదీశారు.


అందులో నంబర్ వన్ :


ఏపీలో అవినీతి విశ్వవ్యాప్తమైందని గీత హాట్ కామెంట్స్ చేశారు. అవినీతిలో నంబర్ వన్ గా నిలిచిందని, ఇదే బాబు గొప్పతనం అంటూ కౌంటర్లేశారు. ఉత్తరాంధ్ర జనం కన్నీరు బాబు కు కనిపించడంలేదని విమర్శించారు. ఎంతసేపూ అభివ్రుధ్ధి ఒకే చోటనే చేస్తూ పోతున్నారని అన్నారు.


ఎంపీలకు విలువ లేదు :


టీడీపీ ఏలుబడిలో ఎంపీలకు ఏ మాత్రం విలువ  లేదని గీత అంటున్నారు. వారిని పట్టించుకునే నాధుడే లేడని, అధికారులు సైతం పక్కన పెట్టేస్తున్నారని ఆవేదన చెందారు. తాను అరకు లోని అనంతగిరిని మోడల్ విలేజ్ గా డెవలప్ చేద్దామనుకుంటే ప్రభుత్వం, అధికారులూ కూడా సహకరించలేదని గీత మండిపడ్డారు. మరి ఈ పదవి ఎందుకని ఆమె ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: