పవన్ కళ్యాణ్ కు పదవులపై పెద్దగా ప్రేమ ఉన్నట్లు తోచదు. ఆయన అభిమానులకు మాత్రం పవన్ ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. అది వారు తరచూ నినాదాల ద్వారా చెబుతూ ఉంటారు. ఇదిలా ఉంటే పవన్ ప్రధాని కావాలని ఒకాయన కోరుకున్నారు. మంచిదే కానీ అది తన ఆకాంక్షా.. లేక సెటైరా.. అదే అర్ధం కావడంలేదు.


కత్తి తీశారు:


ఆయన సినీ విమర్శకుడిగా కంటే పవన్ తో మాటల యుద్ధం మొదలెట్టాకే అందరికీ సుపరిచితుడు. ఆయనే కత్తి మహేష్. లేటేస్ట్ గా కత్తి మళ్ళీ తన ట్వీట్ కి పదును పెట్టాడు. పవన్ పుట్టిన రోజున ఎంతో మంది అతనికీ గ్రీటింగులు చెబితే కత్తి తనదైన స్టైల్లో చెప్పాడు. హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్. మీ జీవన ప్రయాణానికి సంబంధించిన ఉద్దేశాలు, స్పష్టత, డైరెక్షన్ గురించి మీకు ఈ ఏడాదైనా బోధపడుతుందని భావిస్తున్నాం. మీరు ఈ దేశానికి ప్రధాని కావాలని ఎదురుచూస్తున్నాం అని మహేష్ కత్తి ట్వీట్ చేశారు.


మళ్ళీ దుమారమే :


పవన్ పై కత్తి చేసిన ట్వీట్ తో మరో మారు దుమారం రేగింది. నెటిజన్లైతే ఓ రేంజిలో విరుచుకుపడుతున్నారు. ఇదేం గ్రీట్ చేయడమని ఆడిపోసుకుంటున్నారు. అయితే మహేష్ కత్తి మాత్రం తాను వెనక్కు తగ్గనని అంటున్నారు.  పవన్ కల్యాణ్ అంటే తనకు ప్రేమని, ఆయన్ని అసలు వదలనని చెబుతున్నారు. పవన్ ఈ దేశానికి  ప్రధాని అయితే చూడాలని ఉంది అని మహేష్ అంటున్నారు. మరి దీనిపై పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: