కేసీఆర్ తన పదునైన మాటలతో ప్రత్యర్థిని ఇరుకున పెట్టగలిగే సమర్ధుడు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ కి మాటల తో గారడీ చేయగల నైపుణ్యం ఉన్న రాజకీయ వేత్త అయితే నిన్న జరిగిన ప్రగతి నివేదిక సభలో అలాంటివేవీ జరుగులేదు. పది నిమిషాలు మాట్లాడినా, పది గంటలు మాట్లాడాల్సి వచ్చినా.. ఆయన మాటల్లోని 'పదును' తగ్గదు. కానీ, ప్రగతి నివేదన వేదిక నుంచి కేసీఆర్‌ ఎలాంటి పదునైన మాటల్నీ సంధించలేకపోయారు.

Image result for kcr

ఇటీవలే కేసీఆర్‌, ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. ప్రధాని సహా పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో (అందరూ బీజేపీ ముఖ్యులే కదా) మంతనాలు జరిపివచ్చారు. జోనల్‌ వ్యవస్థపై నరేంద్రమోడీని కేసీఆర్‌ ఒప్పించారు. కానీ, ప్రగతి నివేదన సభలో 'కేంద్రం మెడలు వంచి సాధించాం..' అనే స్థాయిలో చెప్పుకున్నారు. మేటర్‌ క్లియర్‌.. ఢిల్లీ పెద్దలు, కేసీఆర్‌ని తమ దారిలోకి తెచ్చుకున్నారు. 'ఢిల్లీ మీద కేసీఆర్‌ పదునైన అస్త్రాలు' సంధించినా అవన్నా ఉత్తుత్తి అస్త్రాలేనని ప్రగతి నివేదన సభ దగ్గరే చాలామంది చర్చించుకోవాల్సి వచ్చింది.

Image result for kcr

నాలుగైదు రోజుల్లో మరో క్యాబినెట్‌ సమావేశం జరగాల్సి వుండడంపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల వద్ద ఖచ్చితమైన సమాచారం లేదు. ముందస్తు ఎన్నికల నిర్ణయాన్ని పూర్తిగా కేసీఆర్‌కే అప్పగించేసింది టీఆర్‌ఎస్‌. ప్రాంతీయ పార్టీల్లో ఇదేమీ అసాధారణమైన విషయం కాదు కదా.! కేసీఆర్‌, ముందస్తుపై నిర్ణయం తీసుకుంటారా.? లేదా.? అన్నదానిపై గతంలో వున్నంత హైప్‌ మళ్ళీ క్రియేట్‌ అయ్యే అవకాశాలూ కన్పించడంలేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: