చంద్ర బాబు చేతిలో మైకు వినే వారు ఉండాల్సిందే కానీ ఎన్నైనా చెబుతాడు. ఇకా తాజాగా మంత్రి వర్గ విస్తరణ గురించి చెప్పారు  త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరగబోతోందని చెప్పారు. చిన్న ట్విస్ట్‌ ఏంటంటే.. టీడీపీ నేత, సినీ నటుడు హరికృష్ణ హఠాన్మరణం కారణంగా మంత్రి వర్గ విస్తరణ ఆలస్యమయ్యిందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం. అసలంటూ హరికృష్ణని ఎప్పుడన్నా టీడీపీలో ముఖ్య నేతగా చంద్రబాబు పరిగణించారా.? అన్న ప్రశ్న టీడీపీ నేతల ముందుంచితే 'లేదు' అనే సమాధానం వస్తుంది. అలాంటిది చంద్రబాబు, హరికృష్ణ కోసం మంత్రి వర్గ విస్తరణని పోస్ట్‌ పోన్‌ చేశారంటే ఎలా నమ్మేది.? 

Image result for chandrababu naidu

బీజేపీతో అంటకాగినన్నాళ్ళూ చంద్రబాబు, మైనార్టీలకు 'కొంత దూరంగా' వుంటూ వచ్చిన మాట వాస్తవం. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో టీడీపీకి, బీజేపీ మద్దతు ఇవ్వకపోవడం, టీడీపీతో కలిసి బీజేపీ ప్రచారం చేయకపోవడం వెనుక 'మైనార్టీ ఓటు బ్యాంకు' రాజకీయాలు వున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఎప్పుడైతే బీజేపీతో తెగతెంపులు చేసేసుకున్నారో, చంద్రబాబుకి మైనార్టీలు గుర్తుకొచ్చేశారు.

Image result for chandrababu naidu

'నారా హమారా.. టీడీపీ హమారా..' అనేశారు. ఇప్పుడేమో మంత్రి వర్గ విస్తరణ అంటున్నారు.. అదీ మైనార్టీల కోసమే.  ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ఒకప్పుడు టీడీపీలో మైనార్టీలకు కీలక పాత్ర వుండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఒకరికి మంత్రి పదవి ఇచ్చినంతమాత్రాన, మైనార్టీలంతా చంద్రబాబుకి అనుకూలంగా మారిపోతారంటే ఎలా.? పైగా, మంత్రి వర్గ విస్తరణకు హరికృష్ణ మరణం అడ్డు వచ్చిందంటే, అంతకన్నా 'నాటకీయత' ఇంకేమీ వుండదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: