ఏ విషయం అయినా ఎవరి వైపు వాదన వారికి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సంగతే. అటువంటిది ఓ అతి పెద్ద ఘోరం జరిగినపుడు ఎవరైనా అందులో నాకు భాగం లేదంటారు, అలా తమ వైపు వాదనలనూ వినిపిస్తారు. అది కధ అయినా సినిమా అయినా అంతే. ఇంత చిన్న లాజిక్ ఆ ఎంపీ గారికి ఎందుకు అర్ధం కావడంలేదబ్బా...


సిన్మాలో  ఆ సీన్లుంటాయా :


ప్రస్తుతం అన్న గారి మీద బయోపిక్ ఆయన తనయుడు బాలయ్య తీస్తున్నాడు. ఈ మూవీ పై రాజకీయంగా దుమారం ఓ రేంజిలో రేగుతోంది. ఎందుకంటే అది అన్న గారి కధ. అందులో అతి కీలకమైనది వెన్ను పోటు ఘట్టం.అది ఉంటుందా లేదా అన్నది అందరికీ సందేహమే.  మరి అన్న గారు అర్ధాంతరంగా జీవితాన్ని చాలించడానికి ఆ వెన్నుపోటు ఎంత కారణమన్నది ఏపీ ప్రజలందరికీ తెలిసిందే. ఆ సీన్లు ఆ సినిమాలో ఉంటాయా అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడుగుతున్నారు.


జగన్ అంటేనే టీడీపీ అంతం :


జగన్ అన్న పేరుకు విజయసాయి కొత్త అర్ధం చెప్పారు. జగన్ అంటే టీడీపీ అంతం అని చదువుకోవాలట. ఏపీలో టీడీపీ పునాదులు కదిలిపోయేలా వైసీపీ అధినేత పాదయాత్ర సాగుతోందని ఆయన అంటున్నారు. ఎక్కడికక్కడ జనాదరణతో సాగుతున్న్ ఈ యాత్ర టీడీపీకి ఇంటి దారి చూపిస్తుందని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఈ రోజు ట్విట్టర్ వేదికగా విజయసాయి టీడీపీపై విరుచుకుపడ్డారు.


వచ్చేది మేమే :


టీడీపీకి మళ్ళీ అధికారం ఇచ్చేది లేదు. అటువంటి ఆశలు పెట్టుకుంటే నిరాశే మిగులుతుందని విజయసాయి అంటున్నారు. రేపటి ఎన్నికలలో వచ్చేది మా సర్కారేనని ధీమాగా చెబుతున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారని, ఆ సంగతి ఇప్పటికే టీడీపీకి అర్ధమైనా ఇంకా తెలియట్లుగా నటిస్తూ ఛవకబారు  కామెంట్స్ చేస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: