వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఓ రేంజిలో ఫైర్ అవుతున్నారు. ఆయన పాదయాత్రలో నిగ్గదీసి అడుగుతున్నారు. ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. బాబు పొత్తులపై వేస్తున్న పంచులు  ఇప్పటికే బాగా పేలుతున్నాయి. ఇక తమపై చేస్తున్న  బురద రాజకీయానికి ఆయన తనదైన స్టైల్లో గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.


నీకు  చెడ్డ మా పక్కనా :


తెలుగుదేశం పార్టీకి ప్రతి ఎన్నికలకూ  ఓ పార్టీ మంచి అనిపిస్తుంది. అదే టైంలో అప్పటివరకూ అంటకాగినా మరో పార్టీ చెడ్డ అనిపిస్తుంది. ఆ చెడ్డను వదిలించుకోవడమే కాదు, దాన్ని మాకు అతి తెలివితో అంటకట్టడానికి ట్రై  చేస్తోందంటూ జగన్ విరుచుకుపడ్డారు. బాబుకు  రాజకీయంగా బాగుంటే వాళ్ళు మంచోళ్ళు, కాకపోతే చెడ్డవాళ్ళు, ఇదేం రాజకీయం బాబూ అంటూ సెటైర్లు  వేశారు.


నాడు అలా అన్నారు :


ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల టైంలో వైసీపీని కాంగ్రెస్ తో కలిపి కట్టారు. మా పార్టీకి ఓటు వేస్తే కాంగ్రెస్ కి వేసినట్లే అన్నారు. ఇపుడు బీజేపీతో విడాకులు ఇచ్చేసిన బాబు ఆ పార్టీని మాకు అంటకడుతున్నారు. వైసీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అంటున్నారు. ఇంత కంటే దిగజారుడు రాజకీయం ఉండదని జగన్ మండిపడ్డారు.


ఇపుడు మంచిదైందా :


నిన్నటి వరకూ కాంగ్రెస్ ని వైసీపీని కలిపి తిట్టిన బాబుకు ఇపుడు కాంగ్రెస్ హటాత్తుగా మంచిగా కనిపించిందా అంటూ జగన్ నిలదీస్తున్నారు. ఏపీని అడ్డగోలుగా విడదీసి కట్టుగుడ్దలతో పంపించారని కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన బాబుకు ఇపుడు అదే కాంగ్రెస్ మంచిగా ఉందని జగన్ సెటైర్లు వేశారు. ఆ పార్టీతో పొత్తూలకు వెంపర్లాడుతూ బీజేపీని తమకు
అంటకడుతున్నారని జగన్ ఫైర్ అయ్యారు. 
బాబు రాజకీయాలను జనం గమనిస్తున్నారని, సరైన టైంలో బుద్ధి చెబుతారని జగన్ అన్నారు. మొత్తానికి బాబు పొత్తులు, ఎత్తుల గురించి పాదయాత్రలో జగన్ వివరిస్తున్న తీరుకు మంచి రెస్పాన్స్ వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: