విద్యార్ధులు  తలచుకుంటే కోటలే కూలతాయి. కొత్త రాజ్యాలు ఏర్పడాతయి. అంతటి పవర్ వారికి ఉంది. అంటువంటి విద్యార్ధులు ఎన్నికల వేళ ఎటు మొగ్గుతారు ఏపీలో ఇపుడు అదే హాట్ టాపిక్ గా ఉంది. రేపటి రోజులు వారివే కాబట్టి తాము జాగ్రత్తగా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రతి స్టూడెంట్ కి ఉంటుంది. మరి ఏపీ కధ ఎంటీ.. 


అందుకేనా :


ఏపీలో విధ్యార్ధులు చాలా దశాబ్దాల తరువాత మళ్ళీ రాజకీయల వైపు ఇంటెరెస్ట్ చూపుతున్నారు. ఈ మధ్యలో ఎన్ని జరిగినా వారు పట్టనట్లుగానే ఉండేవారు. పాలిటిక్స్ అంటే మొహం తిప్పుకుని పోయేవారు. అటువంటిది వారిలో ఆ చేంజ్ కి రీజన్ ఎంటబ్బా అని వెతికితే ఒకటే ఆన్సర్  వస్తోంది. అదే ఏపీ విభజన.


ఫ్యూచర్ గుబులు :


ఉమ్మడి ఏపీలో విద్యార్ధిలోకం తమ పనేంటో తామేంటో అన్నట్లుగా ఉండేది. అసలు విభజన జరగకూడదనీ కోరుకుంది. కానీ జరిగిపోయింది. ఇపుడు ఉన్నటువంటి ఏపీలో ఎటువంటి జాబ్ క్రియేషన్ లేదు. పేరుకు పాలకులు చెబుతున్నారు కానీ, నిజానికి ఇక్కడ ఏం లేదన్నది చదువుకున్న ప్రతీ కుర్రడికీ తెలిసిందే. దాంతో వారంతా ప్రత్యేక హోదా మీద ఆశలు పెట్టుకున్నారు.


హోదా పైనే ఓటు :


ప్రత్యేక హోదా తెస్తారనే 2014లోనూ స్టూడెంట్స్ ఇక్కడ టీడీపీ, అక్కడ బీజేపీ ని గెలిపించారు. నాలుగేళ్ళు కలసి కాపురం చేశాక టీడీపీ బయటకు వచ్చి హోదాపై పోరాటం అంటున్న విధ్యార్ధులెవరూ నమ్మడంలేదు. బీజేపీని, టీడీపీని కలపి వ్యతిరేకిస్తున్నారు. ఇదే టైంలో హోదా ఇస్తామని ముందుకు వచ్చిన కాంగ్రెస్ ని కూడా వారు నమ్మకపోగా ఫైర్ అవుతున్నారు. ఆ పార్టీ వల్లనే విభజన జరిగిందన్నది వారి కోపం వెనక కారణం.


వైసీపీ వైపే చూపు :



ఇపుడున్న పరిస్థితులలో వైసీపీ కే విధార్ధులు జై కొడుతున్నారు. హోదాపై ఇంతవరకూ కధ నడిచిందంటే అందుకు జగన్ కారణమని వారు గట్టినా నమ్ముతున్నారు. విశాఖ పాదయాత్రలో జగన్ ని పెద్ద సంఖ్యలో విధ్యార్ధులు కలవడం విశేష పరిణామమే. ముఖ్యంగా యూనివర్సిటీ విధార్ధులు జగన్ ని కలసి డైరెక్ట్ గా మద్దతు ఇస్తున్నారు. మీరు సీఎం కావాలని వారే అంటున్నారు. ఏయూ, నాగర్జున, తిరుపతి వెంకటేశ్వర యూనివర్శిటీ, పద్మావతి వర్శిటీ విద్యార్ధులు జగన్ తో అడుగులు వేస్తున్నారు. 

ఇందులో టీడీపీ, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలు ఉండడం గమనార్హం. తొందరలోనే వీరంతా ఓ మీటింగ్ పెట్టుకుని వైసీపీకి మద్దతు పై కీలక ప్రకటన చేయాలని కూడా డిసైడ్ అయ్యారని టాక్. మరి చూడాలి ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: