గతంలో వైసీపీ అధినేత జగన్ కేసును విచారించిన మాజీ సిబిఐ డైరెక్టర్  జేడీ లక్ష్మీనారాయణ ...ఆంధ్ర రాష్ట్రం నుండి బదిలీ అయి మహారాష్ట్రలో పని చేయడం జరిగింది. అయితే రీసెంట్ గా ఇటీవల జేడీ లక్ష్మీనారాయణ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అప్పట్లో జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్న వార్తలు కూడా వచ్చాయి. అయితే జేడీ లక్ష్మి నారాయణ ఆ వార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు.  

Image result for jd lakshmi narayana

అయితే ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణ సమాజ సేవలో ప్రజలను చైతన్యపరచడం లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల జె డి లక్ష్మీనారాయణ ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నానని, వాటి పరిష్కారం కోసం రాజకీయాల్లోకి రావాల్సి వస్తే కచ్చితంగా వస్తానని అన్నారు.

Image result for jd lakshmi narayana

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ రాజకీయాలు, ఎన్నికల ప్రక్రియ నుంచి మద్యం, కులం, డబ్బును పార్రదోలేందుకు ప్రజలు నడుం బిగించాలని కోరారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే తాను కూడా పోరాటానికి సిద్ధమని చెప్పారు.

Image result for jd lakshmi narayana

వ్యవసాయ, చేనేత కార్మికుల అభ్యున్నతే లక్ష్యంగా ఓ మేనిఫెస్టోను రూపొందిస్తామని వెల్లడించిన లక్ష్మీ నారాయణ, కౌలు రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయాన్ని సరిగ్గా ఉపయోగిస్తే రాష్ట్ర ఖజానా లో అత్యధిక భాగం వ్యవసాయ రంగం నుండే వస్తుందని అన్నారు లక్ష్మీనారాయణ.




మరింత సమాచారం తెలుసుకోండి: