రాజకీయాలలో నమ్మకం ఎంత ఉండాలో అంత ఉండకూడదు కూడా. ఎందుచేతనంటే పరిణామాలు ఎపుడూ ఒకేలా ఉండవు. అవి ఎప్పటికపుడు మారిపోతూంటాయి. ఈ సంగతి తలలు పండిన వారికి తెలియదనుకోగలమా. తెలిసినా తెలినట్లుగా ఉంటే చెప్పలేం. అయినా ఇదీ రాజకీయంలో ఓ భాగమేనేమో సుమా..


బాబు అలా చెయాలి :


కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ రోజు మరో మారు  డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా కాపులకు ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. తాజా అసెంబ్లీ సమావేశాలకు ముందే కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ముద్రగడ కోరుతున్నారు. 


అయ్యే పనేనా :


ఇదంతా బాగానే ఉంది కానీ ముద్రగడ చెబుతున్నట్లుగా చేసేందుకు బాబుకు ఇపుడు అవకాశం ఉండాలి. ఆ అవకాశం ఆయన ఎపుడో వదులేసుకున్నారాయే.  కేంద్రంతో సఖ్యతగా ఉన్న రోజులలోనే కాపుల వ్యవహారం ఎటూ తేలలేదు. ఇపుడు ఎన్నికల టైంలో బాబు ఏం చేయగలరని ముద్రగడ ఈ డిమాండ్ చేశారో మరి మరో వైపు బీసీల కోసం బాబు వరాలు ఇవ్వబోతున్న టైం ఇది. తొందరలోనే ఉత్తరాంధ్ర వేదికగా భారీ మీటింగుకు టీడీపీ రెడీ అవుతోంది.



ఇలాంటి స్తితిలో కాపుల అంశం లో బాబు కొత్తగా మళ్ళీ చేసేది, చెప్పేది ఏం ఉంటుందన్నది అందరికీ తెలిసినా ముద్రగడకు అర్ధం కావడం లేదా లేక అయన కూడా రాజకీయంగానే మాట్లాడుతున్నారనుకోవాలా  ఇక, . కాపులకు ఇచ్చిన హామీని నెరవేరిస్తే చంద్రబాబుకు లక్ష మందితో ఘన సన్మానం చేస్తామని ముద్రగడ పద్మనాభం చెబుతున్నారు.  సన్మానాల సంగతి తరువాత. బాబుకు ఓట్లు కావాలిపుడు,మళ్ళీ కాపులు ఓట్లు వేస్తామంటే మరో మారు అసెంబ్లీలో తీర్మానం చేయమన్నా  బాబు చేస్తారు. అంత కంటే మరేం జరిగేది  లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: