పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ఇప్పటికే నాలుగేళ్లు దారి పోయింది. మొన్నటివరకు టీడీపీ తో కలిసి బండి లాగించేశాడు ఇప్పుడు టీడీపీ మీద విమర్శలు చేస్తూ , కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటూ ముందుకు సాగి పోతున్నాడు.  ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదంటూనే 175 స్థానాల్లో పోటీ చేస్తానంటాడు. ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటానంటాడు. మీరు అవిశ్వాసం పెట్టండి, ఢిల్లీలో నా సత్తా చూపిస్తానంటాడు.. తీరా ఆ సమయం వచ్చాక తోకముడిచి ఇంట్లో కూచుంటాడు.

Image result for pavan janasena

ఒక్కటేంటి, పవన్ మాటలు, చేతలు అన్నీ ఊహాతీతాలే. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రెస్ నోట్ కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాలకు వ్యూహాతీతమే. నిన్నటివరకూ దుమ్మెత్తిపోసిన చంద్రబాబు, లోకేష్ పేర్లను ప్రస్తావిస్తూ వారికి ధన్యవాదాలు చెప్పేందుకే ఇది బయటకి వదిలినట్టు తెలుస్తోంది. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు ధన్యవాదాలు అంటూ విడుదల చేసిన ఈ ప్రెస్ నోట్ లో కేవలం రామోజీరావు, చంద్రబాబు, లోకేష్ మినహా ఇంకెవరి పేరూ చేర్చలేదు.

Image result for pavan janasena

పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారిలో వీరే ప్రముఖులా? మెగాస్టార్ చిరంజీవి సహా ఇతర కుటుంబ సభ్యులు, తనని అంటిపెట్టుకుని తిరుగుతున్న ఎర్రకండువాలు, ఇతర పార్టీల నేతలు, ఇంకెవరి పేర్లూ ఇందులో కనిపించడానికే వీల్లేదని అనుకున్నారా? అసలు జనసైనికులు కానీ, కిందిస్థాయి నేతలు కానీ తమ ప్రత్యర్థులెవరో తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అయ్యవారు అమావాస్యకు ఎలా ఉంటారో, పౌర్ణమికి ఎలా ఉంటారో తెలుసుకోలేక సతమతమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: