₹300 కోట్లు ఖర్చుచేసి రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ప్రజాసమీకరణతో ప్రగతి నివెదన సభను - 'నః భూతో నః భవిష్యతి' గా నిర్వహించి ఉత్సాహంతో ఉవ్విళ్ళూరుతున్న టిఆరెస్ పార్టీ పాలపొంగుపై గ్లాసుడు నీళ్ళు చల్లినట్లు – పార్టీలో అసంతృప్తి జ్వాలలు రాజు కుంటున్న వార్తలు పార్టీ అభిమానుల్ని కార్యకర్తలను కలవరపాటుకు గురి చేస్తుందని తెలుస్తుంది.
D Srinivas KCR కోసం చిత్ర ఫలితం
మరో వైపు కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యులు ప్రగతి నివెదన సభ సమయంలో హరీష్ రావు పట్ల ప్రదర్శించిన అనుచిత ప్రవర్తనను, ఆయన అభిమానులు హరీష్ రావు  నారాజైనట్లు కూడా గమనించారని, మరో ముసలం ఆ ఇంట్లోనే పుట్టే అవకాశం ఉందని అంటున్నారు. 
KCR KTR Kavita కోసం చిత్ర ఫలితం
తెలంగాణా టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి  శ్రీనివాస్, మరోసారి టీఆర్ఎస్ పార్టీ పై సంచలన విమర్శలు చేశారు. మంత్రిమండలిలో కూడ చాలామంది అసంతృప్తులు ఉన్నారని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం నాడు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
D Srinivas KCR కోసం చిత్ర ఫలితం
కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్,  కొంతకాలం క్రితం టీఆర్ఎస్ లో చేరారు. దానికి సంతసించిన కెసిఆర్ శ్రీనివాస్‌ కు రాజ్యసభ సభ్యత్వాన్ని  కట్ట బెట్టారు అంతేకాదు, ఆయన రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ సలహదారు బాధ్యతలను కట్టబెట్టారు.  



రెండు నెలల క్రితం డీ శ్రీనివాస్, టిఆరెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా నిజామాబాద్ ఎంపీ,  కెసిఆర్ తనయ కవిత నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అతనిపై చర్యలు తీసు కోవాలని కేసీఆర్ కు లేఖ పంపారు. 
సంబంధిత చిత్రం
ఈ విషయమై కేసీఆర్ కు వివరణ ఇచ్చేందుకు డీ.శ్రీనివాస్ ప్రయత్నించినా కెసిఆర్ ఆయనకు సమయం ఇవ్వలేదు. గతనెలలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో  డీ శ్రీనివాస్ సమావేశమయ్యారని సమాచారం అందిందప్పుడు.  
D Srinivas KCR కోసం చిత్ర ఫలితం
గత నెల చివరి వారంలో టీఆర్ఎస్ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభపక్ష సమావేశానికి కూడ డీ.శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే ఇప్పుడు హటాత్తు గా డీ శ్రీనివాస్ తో వివాదం ముగిసిపోయిందని భావించిన వేళ, నేడు డీ.శ్రీనివాస్ నిజామాబాద్ లో మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేయడం కీలకం అయింది. 
D Srinivas KCR కోసం చిత్ర ఫలితం
కేసీఆర్ మంత్రి మండలిలో చాలా మంది అసంతృప్తులు ఉన్నారని తాజాగా డీశ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు నేడు హట్-టాపిక్ గా మారాయి.కేసీఆర్ కేబినెట్ లో  చాలా మంది మంత్రులు అసంతృప్తితోనే కాలం వెళ్లదీస్తున్నారని విపక్షాలు అవకాశం దొరికినప్పుడల్లా ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. అయితే డీ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. 

సంబంధిత చిత్రం

మరింత సమాచారం తెలుసుకోండి: