"ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ - ఐ-పిఏసి" సంక్షిప్తంగా ఐ-పాక్ 55 రోజులపాటు 712 జిల్లాలలో 57 లక్షల మంది ప్రజలు పాల్గొనగా ఇటీవల నిర్వహించిన సర్వే "ఎజండా ఆఫ్ ది నేషన్" ను ముందుకు తీసుకెళ్ళగల దమ్మున్న నేతగా భారత ప్రధాని నరెంద్ర మోడీ 48% మంది నిర్ణయించారు. ఈ సర్వేని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషొర్ సారధ్యం లోని సలహా మండలి సభ్యులు 'నేషనల్ అజెండా ఫోరం' గా ఏర్పడి ఈ సర్వే నిర్వహించింది. ఇందులో ఈ ఫోరం నిర్ణయించిన 923 మందిలో జాతి గుర్తించిన దమ్మున్న నాయకుడుగా ప్రస్తుత భారత ప్రధాని నరెంద్ర మోడీ ముందు నిలిచారు.

modi-pti

ఆయనకు ఎంతో దూరంలో అదీ రెండవ స్థానంలో రాహుల్ గాంధి 11% ఓట్లతో నిలిచారు. ఈ సర్వే ఫలితాలు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మూడవ స్థానం లోను, ఉత్తరప్రదేశ్ మాజీ యువ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ ను 7% ఓట్లతో నాలుగవ స్థానంలోను, పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమత బెనర్జీ 4.1% ఓట్లతో ఐదవ స్థానలో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బిఎస్పికి చెందిన మాయవతి 3.1% ఓట్స్ తో ఆరవస్థానంలో నిలిచినట్లు తెలుస్తుంది.

I PAC survey కోసం చిత్ర ఫలితం 

ఈ సర్వె బృందం ఎంపిక చేసిన నాయకుల్లో ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్, మహరాష్ట్ర ఎన్సిపి నాయకుడు శరద్ పవార్, సిపిఎం నాయకుడు సీతారాం యేచూరి మొదలైన శక్తివంతమైన ప్రాంతీయ నాయకులు కూడా ఉన్నారు.

 I PAC survey కోసం చిత్ర ఫలితం

ఈ ఫొరం సర్వెలో పాల్గొన్నవారిని ఈ క్రింద ఉదహరించిన అంశాలపై స్పందించమని కోరారు.

*మహిళా సాధికారత

*వ్యవసాయ సంక్షోభం

*ఆర్ధిక అసమానత

*విద్యార్ధుల సమస్యలు

*ఆరోగ్యం & పరిశుభ్రత

*పారిశుధ్యం

*సామాజిక ఐఖ్యత

*అందరికీ ప్రాధమిక విధ్య

I PAC survey కోసం చిత్ర ఫలితం 

అంతేకాదు "రాజకీయాల్లో తప్పనిసరిగా ఉండవలసిన సమర్ధత గల వ్యక్తులు" గా ఈ సర్వె లో - అక్షయ కుమార్, రఘురాం రాజన్, ఎమెస్ ధోనీ, యోగీ రాందేవ్, జర్నలిష్ట్ రవీష్ కుమార్ గుర్తించబడ్డారు.

సంబంధిత చిత్రం

2013లో కూడా ఇదే ప్రశాంత్ కిషొర్ "సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్" పేరుతో నిర్వహించిన సర్వె లో కూడా అత్యంత సమర్ధుడైన వ్యక్తిగా, జాతికి  "అత్యంత అభిమాన నేత" గా ప్రస్తుత ప్రధాని నరెంద్ర మోడీ యే గుర్తించబడ్డారు.

 mamata aravind akhilesh maya nithish కోసం చిత్ర ఫలితం

విమర్శకుల విశ్లేషణ ప్రకారం ఇది ఆన్ లైన్ సర్వె కాబట్టి ఇది గ్రామీన భారతం లోని ప్రజలకు అందుబాటులో లేకుండా ఉండి ఉండవచ్చునని అన్నారు. అయితే ఐ పిఏసి సభ్యులు మాత్రం దేశంలోని ఎక్కువ బాగాన్ని అంతర్జాలం ద్వార ఈ సర్వె చొచ్చుకుపోయిందని అదీ 55 రోజులు నడిచిన ఈ సర్వేలో గ్రమీణ భారతం కూడా పాల్గొన్నదని నిర్ద్వందంగా చెపుతున్నారు.

 narendra modi life size కోసం చిత్ర ఫలితం

2014లో నరెంద్ర మోడీ బృందంలో ప్రముఖుడుగా పాల్గొని విజయ సాధనకు వ్యూహాలు రచించిన ప్రశాంత్ కిషొరె 2015లో బిహార్లో నితీష్ కుమార్ నాయకత్వంలోని మహాఘట్బందంకు కూడా విజయానికి వ్యూహాలు పన్నారు. అయితే 2017లో మాత్రం యుపిలో కాంగ్రెస్-సమాజ్వాది పార్టీకి చేసిన వ్యూహాలు వైఫల్యం చెందటం గుర్తించదగిన అంశం.    

I PAC 2018 survey Hero MOdi కోసం చిత్ర ఫలితం 

బాజపా అంతర్గత సమాచారం ప్రకారం ప్రశాంత్ కిషోర్ 2019 బాజపా లోక్ సభ ఎన్నికల వ్యూహకర్తగా, ప్రచార పర్యావరణ రధసారధిగా నియమించారని తెలుస్తుంది. వీటికి మించి మహాత్మా గాంధి 150 వ జయంతి ఉత్సవాల నిర్వహణా ప్రణాళిక తయారు చేయవలసిన బాధ్యతను కూడా ఒప్పగించారని సమాచారం. 

I PAC 2018 survey graph కోసం చిత్ర ఫలితం    

మరింత సమాచారం తెలుసుకోండి: