హరికృష్ణ చనిపోవడం తో ఇప్పడూ అందరికీ ఒక ప్రశ్న మొదలవుతుంది. అదే టీడిపీ పొలిట్ బ్యూరో సభ్యత్వం హరికృష్ణ స్థానం లో ఎవరికీ ఇస్తారని అయితే హరికృష్ణ చనిపోవడం తో ఆ స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో భర్తీ చేయాలని చాలా మంది పార్టీ నాయకులూ చెబుతున్నారు.  జనసేన పార్టీకి మద్దతుగా ఉన్న ఓ పత్రిక జూనియర్‌ ఎన్టీఆర్‌ను పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవాలని చాలామంది సీనియర్‌ నేతలు చంద్రబాబు వద్ద ప్రతిపాదించారని రాసింది.

Image result for jr ntr tdp

త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, అది అయిపోయాక దీనిపై నిర్ణయం తీసుకుందామని బాబు చెప్పారట. మరోపక్క హరికృష్ణ సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను పక్కనపెట్టి జూనియర్‌ని పొలిట్‌బ్యూరోలోకి తీసుకుంటే ఎలాంటి పరిణామాలుంటానేది ఆలోచించాలన్నారు. టీడీపీ నేతల్లో హరికృష్ణకు చాలామంది అభిమానులున్నారు. అలాగే జనంలోనూ ఆయనంటే ఇష్టపడేవారు అనేకమంది ఉన్నారు.

Image result for chandra babu

హరి భౌతికకాయాన్ని అంత్యక్రియల కోసం ఊరేగింపుగా తీసుకెళుతున్నప్పుడు తండోపపండాలుగా జనం వచ్చారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున జూనియర్‌ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. జనాన్ని ఉర్రూతలూపేలా చేసిన ప్రసంగాలను చంద్రబాబు ఎంతగానే ప్రశంసించారు. ఆ తరువాత జూనియర్‌ ఎన్టీఆర్‌ క్రమంగా టీడీపీకి దూరమయ్యారు. బాబే అతన్ని దూరంగా పెట్టారని జనం అనుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: