ఏంటి? ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోందా?  చంద్ర‌బాబు వంటి రాజ‌కీయ అప‌ర చాణిక్యుడు ఎప్పుడు ఎలాంటి రాజ‌కీయాలు చేస్తారో చెప్ప‌డం క‌ష్టం. వ‌చ్చే ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారడం, గెలుపు గుర్రం ఎక్కి అధికార ప‌గ్గాలను మ‌ళ్లీ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో ప్ర‌తి అడుగు అత్యంత కీల‌క‌మ‌ని భావిస్తున్నారు చంద్ర‌బాబు. ప్ర‌తి ఓటు, ప్ర‌తి సీటు కూడా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మ‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే త‌న‌కు అనుకూలంగా ఉన్న అన్ని మార్గాల‌ను చంద్ర‌బాబు వాడుకుంటున్నారు. ముఖ్యంగా సామాజిక వ‌ర్గాల వారిగా విడిపోయిన ఏపీ రాజ‌కీయాల‌ను త‌న‌దైన శైలిలో త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు స‌ద‌రు సామాజిక వ‌ర్గాల‌ను సైతం బాబు మ‌చ్చిక చేసుకుంటు న్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప‌లు వ‌ర్గాల‌కు వ‌రాల మీద వ‌రాలు ప్ర‌క‌టిస్తున్నారు. 


అదేస‌మ‌యంలో అటు సినీ గ్లామ‌ర్‌, ఇటు నంద‌మూరి ఫ్యామిలీ తాలూకు త‌ళుకుల‌ను సైతం త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు బాబు రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల మృతి చెందిన నంద‌మూరి హ‌రికృష్ణ విష‌యంలో చంద్ర‌బాబు చూపించిన అతి ప్రేమ‌పై అప్ప‌ట్లోనే కొన్ని స‌టైర్ల‌తో కూడిన వ్యాసాలు వెలువ‌డ్డాయి. నిజానికి హ‌రికృష్ణ పాడె ప‌ట్టేంత ప్రేమ చంద్ర‌బాబుకు ఉండ‌డం మంచిదే అయినా.. నిజానికి అంత ప్రేమ ఆయ‌న‌కు లేద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. అయితే, నంద‌మూరి ఫ్యామిలీ తాలూకు ఓటు బ్యాంకును క‌దిలించేందుకు, తాను నంద‌మూరి ఫ్యామిలీకి వెల్ విష‌ర్‌నేన‌ని చెప్పుకొనేందుకు ఆయ‌న చేసిన ప్ర‌యోగం బాగానే స‌క్సెస్ అయింది. ఇక‌, ఈ క్ర‌మంలోనే ఇప్పుడు పార్టీలోనూ స‌మూలంగా నంద‌మూరి ఫ్యామిలీకి గుర్తింపు ఇవ్వ‌డం ద్వారా మ‌రింత‌గా సెంటిమెంట్ రాజ‌కీయాల‌ను పండించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు స‌మాచారం. 

Image result for nandamuri family

ఈ క్ర‌మంలోనే జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు టీడీపీ అత్యున్న‌త‌స్థాయి ప‌ద‌వి అయిన పొలిట్ బ్యూరోలో అవ‌కాశం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకు న్న‌ట్టు తెలుస్తోంది. హ‌రికృష్ణ మ‌ర‌ణించే వ‌ర‌కు కూడా ఆయ‌న ఈ ప‌ద‌విలో ఉన్నారు. దీంతో ఆ ప్లేస్ ఇప్పుడు ఖాళీ అయింది. అయితే, దీనిని వేరే వారికి ఎవ‌రికైనా కేటాయించే అవ‌కాశం ఉంది. ఈ ప‌ద‌వి కోసం ప‌లువురు సీనియ‌ర్లు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే, ఇలా చేస్తే.. పార్టీలో ఇక‌, నంద‌మూరి ఫ్యామిలీ ఛాయ‌లు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే అవ‌కాశం ఉంటుంది. ఇది చంద్ర‌బాబుకు మాయ‌ని మ‌చ్చ‌గా.. విప‌క్షాలు, ముఖ్యంగా ఎన్టీఆర్ కుమార్తె ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి విమ‌ర్శ‌ల బాణాలు అందించిన‌ట్టు అవుతుంది.
Image result for chandrababu
దీని నుంచి కాపాడుకునేందుకు, అదేస‌మ‌యంలో పార్టీలో జూనియ‌ర్ వంటి ప్ర‌జాక‌ర్ష‌క వ్య‌క్తి ఉంటే.. దాని ద్వారా ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందేందుకు కూడా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు సీనియ‌ర్లు. ఈ నేప‌థ్యంలోనే జూనియ‌ర్‌ను పొలిట్ బ్యూరోలోకి తీసుకుని ప‌ద‌విని అప్ప‌గించ‌డం ద్వారా అటు నంద‌మూరి ఫ్యామిలీని తాను చిన్న‌బుచ్చ‌లేద‌ని, ప్రాధాన్యం ఇస్తున్నాన‌ని చెప్ప‌క‌నే చెప్ప‌డంతోపాటు.. మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో జూనియ‌ర్‌ను తురుపు ముక్క‌గా వాడుకునేందుకు చంద్ర‌బాబు ప‌క్కా వ్యూహం ర‌చించిన‌ట్టు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. దీనికి జూనియర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి!


మరింత సమాచారం తెలుసుకోండి: