ఆయన సర్వేశ్వరుడే. ఎక్కడ ఉన్నా అన్నీ చూస్తూనే ఉంటాడు. సమయానికి తగినట్లుగా సర్వేలను  చేసి వెల్లడిస్తూంటాడు. ముద్దు పేరు ఆంధ్రా ఆక్టోపస్. ఆయన సర్వే ఎపుడూ గురి తప్పలేదు. అలాగే గే ఆయన లక్ష్యాలూ తప్పలేదు. అటువంటి నాయకడు మళ్ళీ జూలు విదిలించి బయటకు వస్తున్నారుట. తన భీష్మ ప్రతినను పక్కన పెట్టేసి రాజకీయాలలోకి దూకేస్తారని జోరుగా టాక్.


సమైక్య వీరుడు :


మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్  పార్టీ నుంచి రాజకీయాలోకి వచ్చిన ఆయన రెండు మార్లు విజయవాడ ఎంపీ అయ్యారు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించి ఓ దశలో హీరోగా నిలిచారు. ఏపీ విడిపోతే రాజకీయాలకు గుడ్ బై అంటూ అప్పట్లో గట్టిన ప్రతిన పూనారు. అన్నట్లుగానే 2014 ఎన్నికలలో పోటీ చేయకుండా ఉండిపోయారు.


బాబు చెంతన :


ఈ మధ్యన ఆయన తరచూ చంద్రబాబు పక్కన కనిపిస్తున్నారు. రాను రానంటూనే పసుపు శిభిరంలో సందడి చేస్తున్నారు. గత ఏడాది నంధ్యాల ఎన్నికలపుడు హోరాహోరీ జరిగితే టీడీపీకి బంపర్ మెజారిటీ వస్తుందని చెప్పి షాక్ తినిపించారు. అది అలాగే జరిగింది కూడా. ఇక రేపటి ఎన్నికల్లో టీడీపీ విజయావకాశాలపై ఎప్పటికపుడు సర్వేలు నిర్వహిస్తూ అధినేతను గైడ్ చేస్తున్నట్లు కూడా భోగట్టా.


ఎక్కేది సైకిలేనా :


మళ్ళీ రాజకీయాలలోకి రావాలనుకుంటున్న లగడపాటి విజయవాడ ఎంపీగానే పోటీ చెయాలనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయన కోరితే బాబు కూడా ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. మరి కొద్ది రోజులలో లగడపాటి సైకిలెక్కడం ఖాయమని అంటున్నారు. మళ్ళీ టీడీపీయే అధికారంలోకి రావలని ఓ సామాజికవర్గం బలంగా కోరుకొంటున్న నేపధ్యంలో లగడపాటి ఆ దిశగా చేయూతను ఇస్తారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: