రాజకీయాలలో కాదేదీ అనర్హం అంటారు. జనాల ఓట్లు ముఖ్యం కానీ పార్టీ ఎక్కడ నుంచి వచ్చింది. కధ ఏంటన్నది ప్రశ్న కాదు. ఆ మాటకు వస్తే ఉత్తరాదిలో ప్రాంతీయ పార్టీలను కూడా ఆదరించిన హిస్టరీ మనకు ఉంది. అటువంటిది నిన్నటి వరకు ఒకటిగా ఉన్న ఏపీలో ఇపుడు పొరుగు రాష్ట్రం నుంచి ఓ పార్టీ ఏపీలో పోటీకి దిగితే నో అనేదెవరు.. పైగా రావాలంటున్నారుట.


నిజంగానేనా :


టీయారెస్ తెలంగాణాలో ముందస్తుకు రెడీ అవుతోంది. ఆ ముచ్చట అలా ఉంటే మరో ఏడెనిమిది నెలలలో ఏపీలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ సిధ్ధమేనా. అంటే అవుననే ఆన్సర్ వస్తోంది. ఈ మాటలు అన్నది ఎవరో కాదు టీయారెస్ అతి ముఖ్య నాయకుడు కేటీయార్. ఏపీలో కూడా పోటీ చేస్తామని ఆయన చాలా సార్లు అప్పట్లో చెప్పారు కూడా. ఇపుడు ఎన్నికల వేళ మళ్లీ అంటూంటే సీరియస్ గానే తీసుకోవాలేమో


రండి బాబూ:


కొత్త రాష్ట్రం తెలంగాణాను బాగా డెవలప్మెంట్ చేసిన తీరును చూసి ఏపీ ప్రజలే పోటీ చేయమని పిలుస్తున్నారని కేటీయార్ అంటున్నారు. అక్కడ ఉన్న పార్టీల కంటే టీయారెస్ నయం అని కూడా అంటున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణాలో కాదు ఏపీలోనొ ఓ రేంజిలో తమకు మద్దతు లభిస్తోందని కేటీయార్ గట్టిగానే చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తూంటే   మరి ముందస్తు తో తెలంగాణా ఎన్నికల్లో గెలిచాక రేపటి ఆంధ్ర ఎన్నికల్లో కూడా టీయారెస్ పోటీకి దిగుతుందేమో అనిపిస్తోంది కేటీయార్ మాటలు వింటే.  


కేసీయార్ కి ఫ్యాన్ మెయిల్ :


సరిహద్దు జిల్లాలతో పాటు ఏపీలో చాల చోట్ల కేసీయార్ కి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారన్నది తెలిసిందే. ఆయన ఈ మధ్యన విజయవాడ వస్తే జనాలు నీరాజనం పట్టిన సంగతి తెలిసిందే. ఇక రాదనుకున్న తెలంగాణాను సాధించి కేసీయార్ మొనగాడు అనిపిస్తే ఇచ్చిన హామీ ప్రత్యేక హోదాను తెచ్చుకోలేక ఏపీ నాయకులు చతికిలపడిన సంగతీ తెలిసిందే. దీనిపైన చర్చ జరిగినపుడు ఏపీకి కేసీయార్ లాంటి నాయకుడు అవసరం అంటూ మెజారిటీ జనం అనుకుంటున్నదీ వాస్తవమే. మరి ఏకంగా కేసీయార్ పోటీకి వస్తే ఆదరించకపోతారా అన్న కోణంలో చూసినపుడు ఏమో అది జరగొచ్చేమో అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: