ప్రస్తుత రాజకీయాల్లో ముఖ్యంగా తెలంగాణా లో ప్రతి పార్టీ వాటి నాయకులు అనుచరులూ ఎవరూ పత్తిత్తులు కారు. ఇప్పుడు కనపడేదంతా అవకాశవాద రాజకీయం. ప్రస్తుతం నిజామాబాద్ లో టిఆరెస్ ఎంపి కవిత అధికారం చలాయిసున్నారు. మంత్రులు, ప్రజా ప్రజా ప్రతినిధులు అధికారగణం అంతా ఆమె వెనకే నడుస్తున్నారు. అయితే అధినేత దగ్గర ఆమె చెప్పిందే వేదం. అందుకే అక్కడి సీనియర్ నేత కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన ప్రస్తుత టిఆరెస్ ఎంపి ధర్మపురి శ్రీనివాస్ అన్నా ఆయన కుటుంబ సభ్యులన్నా ఆమెకు గిట్టట్లేదంటున్నారు. అందుకే ఆమె చక్రం తిప్పారంటున్నారు. దాంతో డి. ఎస్ కు ఆయన కుటుంబ సభ్యులకు కష్టాలు మొదలయ్యాయి dharmapuri srinivas family Vs KCR family కోసం చిత్ర ఫలితంనేను రాజీనామా చేయను - దయచేసి నన్ను సస్పెండ్‌ చేయండి. లేకుంటే తీర్మానం వెనక్కి పంపండి’ అని మంగళవారం అల్టిమేటం జారీ చేసి మీడియా ఎదుట టీఆర్ఎస్ కి సవాలు విసిరారు డిఎస్. ఆయన అలా అన్నారో లేదో, ఇక డీఎస్ కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం మొదలైంది. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ మరుసటి రోజే అంటే బుధవారం మళ్లీ సొంత గూటికే చేరుతున్నారనే ప్రచారం జోరు అందుకుంది. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా లను డీఎస్‌ కలవనున్నారని, ఆయన చేరికకు అధిష్టానం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న సోనియా, రాహుల్‌ సమక్షంలో ఎమ్మెల్సీ భూపతి రెడ్డి తో పాటు డీఎస్‌ కాంగ్రెస్‌ లో చేరనున్నారని ప్రచారం జరుగుతోంది.
dharmapuri srinivas family Vs KCR family కోసం చిత్ర ఫలితం
అయితే ఈ విషయంలో ధర్మపురి శ్రీనివస్ను మీడియా సంప్రదించగా, తను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవంలేదని తెలిపారు. మీడియాకు అన్ని
విషయాలు చెప్పాల్సిన అవసరం లేదని, తను తీసుకునే నిర్ణయం తన వ్యక్తిగత మన్నారు. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలే అని కొట్టి పారేశారు. తనకు టీఆర్‌ఎస్‌ అధిష్టానం నుంచి సమాధానం కావాలని, నిన్న అన్ని విషయాలు చెప్పానన్నారు. తనడిగిన ప్రతి ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ స్పష్టతను ఇవ్వాలన్నారు. కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలపై తను స్పందించనన్నారు.
dharmapuri srinivas family Vs KCR family కోసం చిత్ర ఫలితం
డీఎస్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కవితతో పాటు పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మంగళవారం స్పందిస్తూ మనసులో ఏదో పెట్టుకుని, నిరాధారమైన ఆరోపణలతో తనను రాజకీయంగా దెబ్బతీయడమే కాకుండా, తన కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారని డీఎస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. లేనిపోనివి కల్పించి, అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి తన కుమారుడు సంజయ్‌పై కేసు పెట్టించారన్నారు. 
dharmapuri srinivas family Vs KCR family కోసం చిత్ర ఫలితం
తన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్‌ బీజేపీలో చేరడం అతని స్వీయ నిర్ణయమని చెప్పారు. ఇందులో తన ప్రమేయం లేదన్నారు. అర్వింద్‌ బీజేపీలోకి వెళుతున్నారనే విషయం ముందు గానే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండు సార్లు వివరించానని, ఆయన సీరియస్‌గా తీసుకోలేదని స్పష్టం చేశారు. 
dharmapuri srinivas family Vs KCR family కోసం చిత్ర ఫలితం
తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా బతికానని చెప్పుకొచ్చా రు. ఎంపీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనపై లేనిపోని అభండాలు వేసి పార్టీ వ్యతిరేకిగా ముద్రవేసి పార్టీ నుంచి బహిష్కరించాలని తీర్మానం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనపై లేనిపోని అభండాలు వేసి పార్టీ వ్యతిరేకిగా ముద్ర వేసి పార్టీ నుంచి బహిష్కరించాలని తీర్మానం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన విషయంలో సీఎం కేసీఆర్‌ స్పందించని పక్షంలో సరైన సమయంలో, సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానన్న డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరికకు మార్గం సుగమం చేసుకోని ఇలా మాట్లాడారని ప్రచారం జరుగు తోంది.

dharmapuri srinivas family Vs KCR family కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: