జగన్ మోహన్ రెడ్డి పోయిన అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించి పాదయాత్ర మొదలుపెట్టిన సంగతీ తెలిసిందే. అయితే ఇప్పుడు మరలా శీతాకాల సమావేశాలు మొదలైనాయి.  ఇందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. యథాతథంగా ఈసారీ ఏకపక్షమే. అధికార పక్షం, ప్రతిపక్షమూ రెండూ టీడీపీయే. వైకాపా అధినేత జగన్‌ తీసుకున్న నిర్ణయం మంచిది కాదని అధికార పక్షంతోపాటు అనేకమంది విమర్శించారు.

Image result for jagan

జగన్‌ సానుభూతిపరుడు, వైఎస్‌ఆర్‌ సన్నిహితుడైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ జగన్‌ నిర్ణయాన్ని చాలాసార్లు తప్పుపట్టారు. ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపించింది అసెంబ్లీకి వెళ్లి తమ సమస్యలు ప్రస్తావించడానికేనని, దాన్ని విస్మరించి గైర్హాజరు కావడం మంచిది కాదని అన్నారు. అయినప్పటికీ నిర్ణయంలో మార్పు చేయాలనుకోవడంలేదు. మరి ప్రజలు వైకాపా నిర్ణయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలియదు. దీన్ని వారు నైతిక కోణంలో చూస్తున్నారా, తప్పుడు నిర్ణయమని అనుకుంటున్నారా తెలియదు.

Image result for jagan

వైకాపా ఎమ్మెల్యేల్లోనే చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. వైకాపా నుంచి వచ్చినవారు ఎమ్మెల్యేగిరికీ రాజీనామా చేయలేదు. వారు శాసనసభ్యులుగా అర్హులో, అనర్హులో తేలలేదు. కేవలం కండువాలు మార్చుకొని నకిలీ టీడీపీ ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతున్నారు. వీరిలో నలుగురు మంత్రులూ అయ్యారు. ఈ ఎపిసోడ్‌ అంతా రాజ్యాంగ విరుద్ధమే. అయినప్పటికీ కోర్టులుగాని, ఎన్నికల కమిషన్‌గాని, గవర్నర్‌గాని ఇప్పటివరకు పట్టించుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: