ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి.  ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ అధినేతలు నువ్వ నేనా అన్న విధంగ కొనసాగుతు న్నాయి.  ముందస్తు ఎన్నికలకు టీఆర్‌ఎస్ సన్నద్ధమవుతుంటే.. కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను ప్రకటించింది. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ వివరాలను ప్రకటించారు.   

Image result for telangana congress

అయితే ఇప్ప‌టికే రెండు ల‌క్ష‌లు రైతు రుణ‌మాఫీ, నిరుద్యోగ భృతిని కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక వీటితో పాటు మ‌రికొన్ని అంశాల‌ను చేర్చాల్సిన స‌మ‌యంలో పార్టీ సీనియ‌ర్ల అభిప్రాయాల‌ను తీసుకుంటోంది మేనిఫెస్టో క‌మిటీ. ఎన్నికలకు సిద్ధమవుతూ పొత్తులు, మేనిఫెస్టో రూపకల్పనపై వ్యూహాలు రచిస్తున్నాయి. 


జీవన్ రెడ్డి నేతృత్వంలో ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొదించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమేం చేయ బోతున్నామో స్పష్టతనిచ్చింది. సమావేశానంతరం మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వివరాలను వెల్లడించారు.

టీ.కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు ఇవే :
  • 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ రూ. 5 లక్షల ఉచిత ప్రమాద బీమా
  • గతంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నవారికి ఇప్పుడు అదనంగా రూ. 2 లక్షలు
  • ఇంటి స్థలం ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికీ... ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 6 లక్షలు. 
  • ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
  • కల్యాణలక్ష్మి సహా బంగారు తల్లి పథకం పునరుద్ధరణ
  • అన్ని రకాల పెన్షన్లకు సంబంధించి ఇప్పుడున్న మొత్తాలు రెట్టింపు
  • విద్య, వైద్య సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు


మరింత సమాచారం తెలుసుకోండి: