టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూసి జాతీయ నాయకులు ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసి దేశంలో పెద్దపెద్ద నాయకులు మెచ్చుకొంటున్నారు అని అన్నారు. ఇటీవల కేటీఆర్ రంగారెడ్డి జిల్లా షాదనగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

Image result for ktr

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..గతంలో ఆంధ్ర ప్రజలకు కేసీఆర్ పట్ల టిఆర్ఎస్ పార్టీ పట్ల కొంత విమర్శ ఉండేదని పేర్కొన్నారు. దానికి కారణం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొంత మంది రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం తప్పుడు ప్రచారం చేయటమే అని అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే టిఆర్ఎస్ పార్టీ పట్ల గాని కేసీఆర్ పట్ల గాని ఆంధ్రా వాళ్ళు చాలా ఎక్కువ అభిమానం చూపుతున్నారని పేర్కొన్నారు.

Image result for ktr

అంతేకాకుండా  కేసీఆర్ పాలనను చూసి టీఆర్ఎస్ ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో కొంతమంది టిఆర్ఎస్ నాయకులు అన్నీ కుదిరితే ఆంధ్రావాలా కోరిక మేరకు టిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని అంటున్నారు. ఇదే క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కెసిఆరే ముఖ్యమంత్రి అవుతారని ఘంటాపథంగా చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: