సాధారణంగా అడవిలో సింహాలు, పులులు, చిరుత అంటే ఎవరికైనా చచ్చేంత భయం.   అలాంటి కృర మృగాలు సంచరించే  ప్రదేశాలకు చాలా దూరంగా ఉంటారు ఎవరైనా.  కొన్ని సార్లు పులులు, చిరుతలు గ్రామాల్లోకి రావడం జనాలపై దాడులు చేయడం చూస్తునే ఉన్నాం. 

తాజాగా ఓ చిరుత పులి మట్టి రోడు మీద ముడుచుకొని పడుకున్న శునకం మీద ఒక్కసారిగా పంజా విసరబోయింది.  అదే సమయానికి అనుకోకుండా ఆ శునకం ఆ చిరుతను చూసి ఒక్కసారే దానిపై రివర్స్ దాడి చేయడానికి ప్రయత్నించింది..అంతే కాదు ఆపకుండా అరవడం మొదలు పెట్టడంతో చిరుత వెనుకంజ వేయక తప్పలేదు. 

కొద్ది క్షణాలు ఆగితే ఆ వీధి కుక్కను చిరుత చంపి తినేది. కాకపోతే..ఊహించని విధంగా ఆ చిరుత ఎటాక్ చేయడంతో..ఆ శునకం కొద్ది సేపటి వరకు వణికి పోయింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: