తెలంగాణ లో ముందస్తు ఎన్నికల జోరు మొదలైంది అన్నీ పార్టీలు ఎన్నికల సమరానికి సై అని కాలు దువ్వు తున్నాయి కానీ తెలంగాణ టీడీపీ మాత్రం ఈ విషయం లో సైలెంట్ గా ఉంది.  తెలుగుదేశం పార్టీ అన్నది తెలంగాణలో జస్ట్ పేరు మాత్రమే మిగిలింది. దాంతోపాటు జూబ్లీహిల్స్ లో భారీ పార్టీ ఆఫీసు మిగిలింది. పోనీ ఎన్నికలు వచ్చాయి. ఇలాంటి టైమ్ ను వాడుకుని పార్టీని మళ్లీ ట్రాక్ లోకి తీసుకురావాలి, పునరుజ్జీవం పోయాలి అన్న ఆలోచనలు అయితే వున్నట్లు కనిపించడం లేదు.

Image result for chandrababu

వాస్తవానికి ఈ రాజకీయ హడావుడి నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చిన్న స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు. చినబాబు లోకేష్ మాత్రం అన్ని స్థానాల్లో పోటీచేస్తాం అనే రొటీన్ ప్రకటన ఒకటి వదిలేసారు. అంతకుమించి మాట అన్నది లేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం నాయకులు అయితే అస్సలు మాటేలేదు. అంటే ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మాట ప్రస్తుతానికి వినిపించదా? టీఆర్ఎస్ కు ఏమైనా ఎదురుదెబ్బ తగిలితే తప్ప, చంద్రబాబు అండ్ కో మాట్లాడలేని పరిస్థితుల్లో వున్నట్లు కనిపిస్తోంది.

Image result for chandrababu

పైగా ఏ మీడియా అండదండలతో ఆంధ్రలో తిరుగులేకుండా నెట్టుకువస్తున్నారో? అదే మీడియా తెలంగాణకు వచ్చేసరికి బాబుగారి కేసి కన్నెత్తి అయినా చూడడంలేదు. టీఆర్ఎస్ సేవలో తరిస్తోంది. అదీకాక పెట్టెలో పడుకున్న పాము మాదిరిగా నోటుకు ఓటు కేసు అలా పదిలంగా వుండనే వుంది. గట్టిగా మాట్లాడితే కేసీఆర్ ఆ పెట్టె మూత ఎక్కడ తీస్తారో అన్న భయం కూడా వుండనే వుంది. అందుకే చంద్రబాబు అస్సలు పెదవి విప్పడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: