రాజకీయాలలో కూడా ఎప్పటికపుడు క్లాసులు తీసుకోవాల్సిందే. ట్రాక్ తప్పుతున్నపుడు అది చాలా అవసరం కూడా. అలాగే ఇచ్చిన వర్క్ ఫినిష్ చేయకపోయినా, కొత్తగా వర్క్ ఇవాలనుకున్నా నేతాశ్రీలకు అధినేతలు క్లాస్ తీసుకుంటూనే ఉంటారు. మార్కులు హై కమాండే వేయాలి కాబట్టి లీడర్లు అంతా ఒకటికి పది మార్లు క్లాస్ లు వినడం చెప్పిన పని చేయడమే బెటర్. 


పూర్ రిజల్ట్ :


ఓ వైపు వైసీపీ అధినేత జగన్ కాళ్ళకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. మరో వైపు పార్టీ నాయకులు టికెట్ల పోరులో బిజీగా ఉన్నారు. మొత్తానికి ఎక్కడికక్కడ జనాన్ని, సమస్యలనూ వదిలేశారని రిపోర్ట్. దీనిని చూసిన జగన్ షాక్ తిన్నారని టాక్. మొత్తం ఏపీవ్యాప్తంగా చూసుకుంటే ఓ పదిహేను నియోజక వర్గాలలో తప్ప మిగిలిన చోట్ల నాయకులు జనానికి దూరంగా ఉంటున్నారన్నది ఆ రిపోర్ట్.


9న మీటింగ్ :


దీంతో అలెర్ట్ అయిన జగన్ ఈ నెల 9న విశాఖలో పార్టీ నాయకులందరితోనూ మీటింగ్ పెడుతున్నారు. ఈ మీటింగులో హాట్ హాట్ డిస్కషన్ల తో పాటు, కొందరికి వార్నింగులు కూడా ఉంటాయని భోగట్టా. పార్టీ కోసం పని చేయకపోతే పక్కన పెడదామని జగన్ క్లారిటీగా చెప్పేస్తారట. ప్రజలలో లేని వాళ్ళకు టిక్కెట్లు ఉండవని కూడా చెబుతారని టాక్.


వంద రోజుల ప్రోగ్రాం :


పార్టీ నాయకులకు మరో మారు వంద రోజుల ప్రోగ్రాం ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఇంటింటికీ వైసీపీ తరహాలో ఈ ప్రోగ్రాం ఉంటుందట. ఎన్నికల ముందు ప్రతి ఇంటి తలుపు తట్టాలని, పార్టీ ప్రణాలికలు చెప్పడంతో పాటు, టీడీపీ అవినీతి కధలు వినిపించాలని నేతలకు జగన్ చెప్పబోతున్నారు. డిసెంబర్ నాటికి ఈ ప్రోగ్రాం పూర్తి అయ్యేలా జగన్ ఆదేశాలు ఇస్తారని అంటున్నారు.


వర్కఔట్ అవుతుందా :


జగన్ తిరుగుతున్నారు, టికెట్ ఇస్తే గెలిచేస్తామనుకునే బ్యాచ్ ఇపుడు వైసీపీలో ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ ప్రోగ్రాం ని ఎంత మంది రిసీవ్ చేసుకుంటారో, ఎంతవరకు చేస్తారో తెలియదు. ఐతే పార్టీ కోసం పని చేయని వారిని దూరం పెట్టాలని జగన్ డిసైడ్ కావడంతో గట్టిగానే పనిష్మెంట్లు ఉంటాయని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: