శ్రీ పీఠం పీఠాధిప‌తి ప‌రిపూర్ణానంద స్వామి  త్వ‌ర‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేర‌టం ద్వారా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా ?  క్షేత్ర‌స్ధాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాలు, ఆయ‌న ఆలోచ‌న‌ల‌ను గ‌మ‌నించిన వారికి అదే అనుమానాలు వ‌స్తున్నాయి. త‌న ఆలోచ‌న‌లు, సిద్దాంతాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని అనుకునే ఏ పార్టీ అయినా వ‌చ్చి అడిగితే ఆ పార్టీలో చేరుతాన‌ని ప‌రిపూర్ణానంద తాజాగా చెప్ప‌టం గ‌మ‌నార్హం. 


హిదుత్వ‌మే ప్ర‌ధాన అజెండా 

Image result for paripoornananda swami meetings

స్వామి చెబుతున్న‌దాని ప్రకారం త్వ‌ర‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరే అవ‌కాశం ఉంద‌ని ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఎందుకంటే, స్వామిది హిందుత్వ సిద్ధాంతమ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. బిజెపిది కూడా సేమ్ టు సేమ్. పైగా కెసిఆర్ ప్ర‌భుత్వం స్వామిని హైద‌ర‌బాద్ నుండి బ‌హిష్క‌రించిన‌పుడు బిజెపి బ‌హిరంగంగా స్వామికి మ‌ద్ద‌తుగా నిల‌బ‌డింది. 


గోషామ‌హ‌ల్ లో ప్ర‌చారం

Image result for paripoornananda swami and rajasingh mla

తాను ప‌లానా పార్టీలో చేరుతాన‌ని ఎప్పుడూ చెప్ప‌లేద‌ని, అయితే, త‌న ఆలోచ‌న‌ల‌తో ఏకీభ‌వించే పార్టీ ఏదైనా వ‌చ్చి అడిగితే చేరుతాన‌ని చెప్ప‌టంలో అర్ధ‌మేంటి ?  బిజెపికి త‌ప్ప ఇంకే పార్టీకి కూడా మ‌త ప్రాతిప‌దిక‌గా సిద్దాంతాలు లేవు. రాజ‌కీయాల్లో త‌న‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఆదిత్య‌నాద‌ధ్ తో పోల్చ‌టం స‌రికాద‌ని కూడా చెబుతున్నారు.  వ‌య‌స్సులో త‌ప్ప త‌మ ఇద్ద‌రికీ ఎందులోనూ పోలిక లేద‌న్నారు. అదే స‌మ‌యంలో పరిపూర్ణానంత మాత్ర‌మే త‌మ అజెండాను జ‌నాల్లోకి బ‌లంగా తీసుకెళ్ళ‌గ‌ల‌ర‌ని బిజెపి కూడా న‌మ్ముతున్న‌ట్లే ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపి గోషామ‌హ‌ల్  ఎంఎల్ఏ  రాజాసింగ్ త‌ర‌పున తాను ప్ర‌చారం చేయ‌నున్న‌ట్లు స్వామి చెప్ప‌టం చూస్తుంటే రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ అవ్వాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్న‌ట్లే క‌న‌బ‌డుతోంది. సో, ప‌రిపూర్ణానంద స్వామికి ఆల్ ది బెస్ట్ చెబుదామా ?



మరింత సమాచారం తెలుసుకోండి: