స్వలింగ సంపర్కంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కం నేరం కాదని చారిత్రక తీర్పు చెప్పింది. దేశంలోని స్వలింగ సంపర్కులకు తీపి కబురు అందించింది. స్వలింగ సంపర్కం  క్రిమినల్ నేరం కాదని దేశ అత్యున్నత ధర్మాసనం తేల్చి చెప్పింది. స్వలింగ సంపర్కం అసహజ లైంగిక చర్య కాదని, కాబట్టి ఇది భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377 కిందికి రాదని  ఈ మేరకు ప్రధాన నాయ్యమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా సహా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ గురువారం తీర్పు వెల్లడించింది.

supreme court decriminalises gay sex

 ఎల్‌జీబీటీ (లెస్బియ‌న్, గే, బైసెక్సువ‌ల్‌, ట్రాన్స్‌జెండ‌ర్‌) కమ్యూనిటీ హక్కులను సుప్రీంకోర్టు గౌరవిస్తుందని ఆయన అన్నారు. ఈ చరిత్రాత్మక తీర్పు వెలువడగానే పలువురు సెలబ్రిటీలు దీనికి మద్దతుగా ట్వీట్లు చేశారు.   గే సెక్స్ నేరం కాదని, అది సెక్షన్ 377 కిందకు రాదని ఐదుగురు జడ్జిలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని చీఫ్ సీజేఐ జస్టిస్ మిశ్రా వెల్లడించారు. సమాజంలో స్త్రీ, పురుషులతో సమానమైన హక్కులే ఎల్జీబీటీ కమ్యూనిటీకి ఉంటాయని జస్టిస్ మిశ్రా స్పష్టం చేశారు.   స్వలింగ సంపర్కం నేరంగా పరిగణించలేమని, లైంగిక స్వభావం ఆధారంగా పక్షపాతం చూపించడమంటే వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లే అవుతుందని వ్యాఖ్యానించింది.

Celebrities welcome Supreme Court verdict on Section 377

గతంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించి జైలుశిక్ష కూడా విధించేలా చట్టం ఉండేది. అయితే, కొందరు స్వలింగ సంపర్కుల పక్షాన సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ‘స్వలింగ సంపర్కం’ తప్పుకాదని తీర్పు చెప్పింది. కాగా, బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్, రచయిత చేతన్ భగత్, కాంగ్రెస్ నేత శశి థరూర్ తీర్పుపై స్పందించిన వాళ్లలో ఉన్నారు. వీళ్లంతా సుప్రీం తీర్పును స్వాగతించారు. సెక్షన్ 377పై తన వాదననే సుప్రీం కూడా వినిపించిందని, తనను వ్యతిరేకించిన బీజేపీ ఎంపీలు ఇప్పుడు సిగ్గుతో తలదించుకోవాలని శశి థరూర్ ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: