ఎట్టకేలకు కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధం అయినాడు. అయితే ఇంకా ఆరునెలల పైగానే అధికార అవకాశం ఉన్న కేసీఆర్ ఇప్పుడే అసెంబ్లీ ని రద్దు చేయడం వల్ల భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.  నవంబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయనీ, డిసెంబర్‌ మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయని కేసీఆర్‌, అసెంబ్లీ రద్దు నిర్ణయం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రకటించడం గమనార్హం. 

Image result for kcr

ప్రస్తుతం కేసీఆర్‌, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిన పరిస్థితి. గవర్నర్‌ నరసింహన్‌, కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిందిగా కోరారు. తెలంగాణ అసెంబ్లీ రద్దుతో, మొత్తంగా తెలంగాణలో ఎమ్మెల్యేలంతా మాజీలయిపోయారు. కేసీఆర్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాగా, మంత్రుల పరిస్థితీ అంతే. తాజా మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో కలిసి కేసీఆర్‌, తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. 

Image result for kcr

ఇంతకీ, కేసీఆర్‌ చేసింది త్యాగమేనా.? అంటే, కేసీఆర్‌కి రాజీనామాలు కొత్త కాదు. రాజీనామా చేసిన ప్రతిసారీ రాజకీయంగా ఆయన మరింత ఎదిగారు. అప్పుడప్పుడూ ఎదురు దెబ్బలు తగిలినాసరే, ఈ రోజు ఆయన ఈ స్థాయిలో వున్నారంటే, అదంతా రాజీనామాల పుణ్యమే. ఆ రాజీనామాల్ని ఆయన త్యాగంగా భావించడంలో వింతేమీలేదు. కానీ, ఐదేళ్ళ పాటు అధికారం చెలాయించే అవకాశాన్ని వదులుకోవడం 'త్యాగం' కాబోదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 'ఇది ఖచ్చితంగా చేతకానితనమే..' అంటున్నారు చాలామంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ప్రభుత్వం, ఐదేళ్ళు పూర్తిగా నిలబడలేక చేతులెత్తేసిందని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: