Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Sep 22, 2018 | Last Updated 7:22 am IST

Menu &Sections

Search

ఆ ముగ్గురికి కేసీఆర్ టిక్కెట్ షాక్‌... !

ఆ ముగ్గురికి కేసీఆర్ టిక్కెట్ షాక్‌... !
ఆ ముగ్గురికి కేసీఆర్ టిక్కెట్ షాక్‌... !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కేసీఆర్ చెప్పిన‌ట్టుగానే ఇద్ద‌రు ముగ్గురికి త‌ప్ప సిట్టింగులంద‌రికీ టికెట్లు ప్ర‌క‌టించారు. తొలిజాబితాలో 105మంది అభ్య‌ర్థుల‌ను స్వ‌యంగా కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఇద్ద‌రికి మాత్ర‌మే టికెట్లు నిరాక‌రిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అందులో ఒక‌రు ఆంధోల్ ఎమ్మెల్యే బాబూమోహ‌న్‌, చెన్నూరు ఎమ్మెల్యే న‌ల్లాల ఓదేలు ఉన్నారు. వీరికి టికెట్లు ఇవ్వ‌డం లేద‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో మిగిలిన స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను పెండింగ్‌లో పెట్టారు. ఇందులో వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పేరును కూడా పెండింగ్ లో పెట్టి కేసీఆర్ పెద్ద షాక్ ఇచ్చారు. అయితే.. వీరు త‌మ ప‌నితీరును మార్చుకోక‌పోవ‌డం వ‌ల్లే టికెట్లు ఇవ్వలేద‌ని పార్టీవ‌ర్గాలు అంటున్నాయి. ఆంధోల్‌లో జ‌ర్న‌లిస్టు క్రాంతికిర‌ణ్‌కు, చెన్నూరులో ఎంపీ బాల్క సుమన్‌కు టికెట్లు ఇచ్చారు కేసీఆర్‌.

telangana-trs-cm-kcr-polls-tickets-anounce-babu-mo

అయితే ఇందులో  కొండా సురేఖ పేరును పెండింగ్‌లో పెట్ట‌డం వ‌రంగ‌ల్ జిల్లాల్ ఈ విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జిల్లాలోఉన్న మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క తూర్పు స్థానాన్నే పెండింగ్ లో ఉంచారు కేసీఆర్‌. ఈ విష‌యంలో ముందుముందు కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది అంద‌రిలో ఉత్కంఠ రేపుతోంది. అయితే.. కొండా సురేఖ పేరును పెండింగ్‌లో పెట్ట‌డానికి గ‌ల కార‌ణాలేమిట‌నే దానిపై పార్టీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యేగా కొండా సురేఖ, ఆమె భ‌ర్త కొండా ముర‌ళి ఎమ్మెల్సీ కొన‌సాగుతున్నారు. అయితే కొంత కాలంగా కొండా దంప‌తులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రిగింది. అంతేగాకుండా..వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌తోపాటు త‌న కూతురు కూడా టికెట్ వ‌స్తుంద‌ని ఆమె చెప్పుకొచ్చారు. 

telangana-trs-cm-kcr-polls-tickets-anounce-babu-mo

ఈ క్ర‌మంలో స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం టికెట్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ కూతురుకేన‌ని, స్పీక‌ర్‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉందంటూ ఆమె బ‌హిరంగంగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపాయి.  కొద్దిరోజులుగా వ‌రంగ‌ల్ న‌గ‌ర మేయ‌ర్ న‌న్న‌పునేని న‌రేంద‌ర్‌కు, కొండా సురేఖ‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీలో గ్రూపులు ఏర్ప‌డ్డాయి. దీంతో కొండా సురేఖ తీరుతో పార్టీకి తీవ్ర న‌ష్టం జ‌రుగుతోంద‌ని ఇక్క‌డి నాయ‌కులు స్వ‌యంగా కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకు టికెట్ ఇచ్చేందుకు ఆయ‌న సుముఖంగా లేన‌ట్టు తెలుస్తోంది. తొలిజాబితాలో ప్ర‌క‌టించ‌కుండా.. పెండింగ్ పెట్ట‌డంతో ఆమె అనుచ‌ర‌వ‌ర్గంలో తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. 

telangana-trs-cm-kcr-polls-tickets-anounce-babu-mo

ఆంధోల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూమోహ‌న్ ప‌నితీరుపై ప్ర‌జ‌ల్లో, పార్టీ క్యాడ‌ర్‌లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంది. అదేస‌మ‌యంలో ఇక్క‌డ కాంగ్రెస్ నేత దామోద‌ర రాజ‌న‌ర్సింహ బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బాబుమోహ‌న్‌కు టికెట్ ఇస్తే ఓడిపోతార‌నీ, ఇక్క‌డి నుంచి  మ‌రొక‌రి అవ‌కాశం ఇవ్వాల‌నే ఆలోచ‌న‌తోనే జ‌ర్న‌లిస్టు క్రాంతికి టికెట్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అలాగే.. చెన్నూరులో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదేలుపై కూడా ప్ర‌జ‌ల్లో, పార్టీ క్యాడ‌ర్‌లో వ్య‌తిరేక‌త ఉంది. సింగ‌రేణి ఎన్నిక‌ల్లో పార్టీ అనుబంధ సంఘం ఓడిపోవ‌డానికి ఆయ‌నే కార‌ణ‌మ‌నే టాక్ అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది. అప్ప‌టి నుంచి ఆయ‌న కేసీఆర్ వ‌ద్ద న‌మ్మ‌కం కోల్పోయార‌నే టాక్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు కూడా టికెట్ నిరాక‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డి నుంచి ప్ర‌స్తుతం ఎంపీగా కొన‌సాగ‌తున్న బాల్క సుమ‌న్‌కు టికెట్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. 


telangana-trs-cm-kcr-polls-tickets-anounce-babu-mo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గులాబీ గూటిలో ముదురుతున్న లొల్లి..!
ఆ మంత్రి విష‌యంలో కేసీఆర్ ఏం చేస్తారో..
టీడీపీలోకి లగడపాటి... ఆ ఎంపీ సీటే టార్గెట్‌... !
ఏపీలో కాంగ్రెస్ - టీడీపీ పొత్తు ఫిక్స్‌... సీట్ల లెక్క ఇదే...!
తెలంగాణలో అందరి దృష్టి ఆ ఒక్క సీటుపైనే... ఎక్క‌డంటే..!
జ‌న‌సేన గ‌ల్లా తెరుస్తారా... !
ఇలాగైతే.. వైసీపీ అడ్ర‌స్ గ‌ల్లంతే.. మ‌రో షాకింగ్ డెసిష‌న్‌... !
వైసీపీ కీల‌క నేత‌పై బాబు లేడీ అస్త్రం...!
చివ‌ర‌కు అది కూడా బాబు మేనేజ్ చేసేశారా.... !
మహాకూటమిలో అదే పెద్ద సమస్య‌..!
తెలంగాణాలో టీఆర్ఎస్ బ‌లం ఏంటి... !
రాధాకు ఉన్న ఏకైక ఆప్ష‌న్ అదేనా.. !
ఆ విష‌యంలో బాబును చూసి నేర్చుకో జ‌గ‌న్‌..!
రాధాతో జగన్‌ రాయభారాలు... ఏం జ‌రిగిందంటే....
వంగ‌వీటికి అనుచ‌రుల స‌ల‌హా.. అదిరిపోయిందిగా..!
వైసీపీలో ' వంగ‌వీటి ' కి తిప్ప‌లు... మెయిన్ రీజ‌న్ ఇదే..!
వంగ‌వీటికి అవ‌మానం.. వైసీపీకి గుడ్‌బై.....ఆ పార్టీలోకి జంప్‌.. !
టీడీపీకి గ‌ట్టి దెబ్బ‌... !