ముందస్తు ఈ మాటకు ఈ మధ్య కాలమంతా పేటెంట్ హక్కులన్నీ మోడీవే. కెంద్రంలో ముందస్తు ఎన్నికలు అంటూ గత ఏడాదిగా మీడియా కోడై కూస్తోంది. బీజేపీ కూడా జమిలి ఎన్నికలు అంటూ హడావుడి చేస్తూ వచ్చింది. కానీ డారింగ్ గా డెసిషన్ మోడీ  తీసుకోలేకపోయారు. కేసీయార్ మాత్రం షాకింగ్ డెసిషన్ తో దేశాన్నంతా ఇటు వైపు తిప్పేశారు. మీసం తిప్పేసి రోషం చూపించారు.


నాలుగేళ్ళ మూడు నెలలు :


కేసీయార్ అధికారంలోకి వచ్చి సరిగా నాలుగేళ్ళ మూడు నెలల నాలుగు రోజులు మాత్రమే. అంటే మరో తొమ్మిది నెలలు పవర్ చేతిలో ఉంది. ఇంతటి అధికారాన్ని అలా విసిరేసి ఎన్నికల రణ క్షేత్రంలోకి దూకేశారంటే ఆ గుండే గట్టిదే మరి. ఎన్ని సర్వేలు గెలుపు ధీమా ఎంతగా పెంచినా అసెంబ్లీ రద్దు చేయాలంటే మాటలతో అయ్యే పని కాదు. అది చేసి చూపించి మొనగాడు అనిపించాడు కేసీయార్.


రెడీయా :


నేను రెడీ, మరి మీరు రెడీయా అంటూ కేసీయార్ సవాల్ చేశారు. అది అలాంటి  ఇలాంటి సవాల్ కాదు స్వీకరించడానికి. అందుకే విపక్షానికి నోట మాట రావడం లేదు. వారలా షాక్ లో ఉండగానే క్యాండిడేట్స్ డిక్లేర్ చేసి సమయం లేదు మిత్రమా అంటూ దూసుకుపోయారు. పక్కా ప్లానింగ్ తో కేసీయార్ వేసిన ఈ ఎత్తుని చిత్తు చేయడం అపోజిషన్ కి కష్టమే సుమా.


మరింత సమాచారం తెలుసుకోండి: