Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 24, 2019 | Last Updated 6:54 am IST

Menu &Sections

Search

టికెట్ కావాలంటే ప్రజల్లో ఉండాల్సిందే తేల్చేసిన చంద్రబాబు..!

టికెట్ కావాలంటే ప్రజల్లో ఉండాల్సిందే తేల్చేసిన చంద్రబాబు..!
టికెట్ కావాలంటే ప్రజల్లో ఉండాల్సిందే తేల్చేసిన చంద్రబాబు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టీడీపీ అధినేత చంద్రబాబు రాబోయే ఎన్నికల కోసం చాలా స్పష్టమైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంతో వ్యయప్రయాసలతో రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న చంద్రబాబు..రానున్న ఎన్నికల్లో తనతో పాటు ఇప్పటి వరకు కలిసి పోరాటం చేస్తున్న..కష్టపడుతున్న నాయకులకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

chandrababu-tdp-amaravathi-elections

ఈ క్రమంలో ఇటీవల అమరావతిలో జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలతో మమేకం కాలేకపోయిన వాళ్లను పక్కన ఉంచడం తప్ప నేనేమి చేయలేను. అని చంద్రబాబు అన్నారు. వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం, మళ్లీ పార్టీ అధికారంలోకి రావలంటే పని చేసే వారికి ప్రాధాన్యం ఇచ్చి, చేయని వారిని పక్కన పెట్లేస్తాం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేసే వారికే పార్టీ టిక్కెట్లు ఇస్తానన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.

chandrababu-tdp-amaravathi-elections

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి దేశంలో ఉన్న పెద్దపెద్ద నాయకులు ఆశ్చర్యపోతున్నారని..ముఖ్యంగా కేంద్రం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం సహకరించకపోయినా రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుందని కొంతమంది ఢిల్లీలో నన్ను ప్రశ్నించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది అంటే అది ప్రజల సహకారం వల్లే అని అన్నారు.

chandrababu-tdp-amaravathi-elections

నేను చేస్తున్న కష్టాన్ని ప్రజలు గుర్తించారు అదేవిధంగా మీ మీ ప్రాంతాలలో ప్రజలు కలిగి ఉన్న అభిప్రాయం మేరకే రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని కరాఖండిగా తెలుగుదేశం నేతలకు స్పష్టం చేశారు చంద్రబాబు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నేతలతో కార్యకర్తలతో కలిసి 2014 ఎన్నికల కంటే 2019లో ఎక్కువ సీట్లు వచ్చేలా కృషి చేయాలని పేర్కొన్నారు.


chandrababu-tdp-amaravathi-elections
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

Kranthi is an independent writer and campaigner.