ప్రపంచంలోనే ప్రముఖులలో ఒకరు టైకూన్ రతన్ టాటా. ఇంతటి వ్యక్తి ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు కి లెటర్ రాశారు. ఆ లేఖలో చంద్రబాబు ని పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యంగా విభజనతో నష్టపోయిన ఏపీ రాష్ట్రాన్ని ఇంతటి తక్కువ కాలంలో ఈ స్థాయికి ఎలా తీసుకొచ్చావు బాబూ అంటూ ప్రశ్నించారు. ఇటీవల అలిపిరిలో టాటా ట్రస్టు ఆధ్వర్యంలో రూ.140 కోట్లతో శ్రీవేంకటేశ్వర క్యాన్సర్‌ వైద్య, విజ్ఞాన సంస్థను ఏర్పాటుకు ఇట్టివల  శంకుస్థాపనకు, రతన్ టాటా వచ్చారు.
Image result for chandrababu naidu
ఆ శంకుస్థాపనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యామంత్రి చంద్రబాబు కూడా వెళ్లారు. రతన్ టాటా, ఆంధ్ర రాష్ట్ర ప్రగతిలో ఇస్తున్న తోడ్పాటుకి, చంద్రబాబు తగు గౌరవం ఇచ్చారు. అంతకు ముందు కూడా ముంబై పర్యటనలో, రతన్ టాటా, చంద్రబాబుకి ఇచ్చిన గౌరవం అందరూ చూసారు. ఆయనే స్వయంగా వచ్చి, చంద్రబాబుని తన ఆఫీస్ లోకి తీసుకువెళ్ళారు. ఈ క్రమంలో రతన్ టాటా చంద్రబాబుకి ఒక లేఖ రాసారు.
Related image
రాష్ట్రంలో పర్యటించిన సమయంలో మీరు నాపై చూపించిన గౌరవానికి కృతజ్ఞత అని పేర్కొన్నారు. ఎంతో అనుభవం వున్నా మీరు లోటు బడ్జెట్ కలిగిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయి ఇప్పటికే రాష్ట్రాన్ని దేశ ఆర్థిక రంగంలో బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మీరు చేసిన కృషి మరువలేనిది అని పేర్కొన్నారు.
Image result for chandrababu ratan tata
ఎంతో అనుభవం కలిగిన మీరు..నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఆంధ్ర ప్రజలు చేసుకున్న పుణ్యం అని పేర్కొన్నారు. అంతేకాకుండా మీకు, మీ రాష్ట్రానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, నేను మీకు సహాయం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారటానికి, మీకు సహకారం అందిస్తాను అంటూ ఆయన లేఖ రాసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: